breaking news
Dandiya
-
భాగ్యనగరంలో బతుకమ్మతో పాటు గర్భా, దాండియా నృత్యాల సందడి
-
పాక్‌లో మిన్నంటిన నవరాత్రి సంబరాలు, గార్బా, దాండియా సందడి
దసరా నవరాత్రి ఉత్సవాలు ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దసరా వేడుకలను నిర్వహించుకుంటారు. దేశంలోని అనేక నగరాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట విశేషంగా నిలిచాయి.పాకిస్తాన్లో నివాసం ఉంటున్న ఇండియన్ ప్రీతం దేవ్రియా ఈ వీడియోను షేర్ చేశారు. అక్కడి భారతీయ భక్తులు గర్బా, దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరాచీ నుండి మరొక వీడియో, ధీరజ్ షేర్ చేసిన మరో వీడియోలు కూడా దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఇవిద్యుత్ దీపాలతో అలంకరించిన ఒక వీధిలో దుర్గామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం విశేషం. ముస్లింలు ఎక్కువగా నివసించే పాక్‌లో నవరాత్రి సంబరాలు ప్రత్యేకంగా నిలిచాయి. వ సోషల్ మీడియా వినియోగదారులు పాకిస్తాన్‌లోని హిందూ సమాజం గురించి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఉత్సుకతతో స్పందించారు.పాకిస్తాన్లో శాకాహారులు , జైనులు ఉన్నారా అని అడిగినప్పుడు, ప్రీతమ్ దేవ్రియా ఉన్నారని ధృవీకరించారు. ఈ వేడుకలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు. పలువురు వారికి "నవరాత్రి శుభాకాంక్షలు" అందించారు. View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్‌లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్‌షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్‌ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్‌గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్‌తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్‌తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్‌కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్‌గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్‌లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్‌లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్‌లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్‌తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
హైదరాబాద్: 'సెలెబ్రిటీ డాండియా నైట్స్' 9వ సీజన్ (ఫొటోలు)
-
ఖైరతాబాద్ : దాండియా వేడుక..నవరాత్రి ఉత్సవ్–2025 (ఫొటోలు)
-
యాంకర్ 'శివజ్యోతి' దాండియా లుక్.. ఇంత క్యూట్ ఉందేంటి! (ఫొటోలు)
-
సికింద్రాబాద్ : దాండియా జోష్...స్టెప్పులు అదరహో (ఫొటోలు)
-
ఆ ఐదు చోట్ల అంబరాన్నంటే దాండియా వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొంది. ఈ నవరాత్రుల వేడుకల్లో దాండియాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దాండియా అనేది గుజరాత్ సంప్రదాయ నృత్యం. అయితే ఇప్పుడు దేశమంతటా దాండియాకు ఎంతో ఆదరణ లభిస్తోంది. దేశంలోని ఆ ఐదు ప్రాంతాల్లో జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలని చాలామంది తహతహలాడుతుంటారు. మరి ఆ ప్రాంతాలెక్కడున్నాయి? అక్కడ వేడుకల్లో పాల్గొనాలంటే ఎంత రుసుము చెల్లించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.అహ్మదాబాద్ (గుజరాత్)గుజరాత్‌లోని పలు నగరాల్లో దాండియా వేడుకలు జరుగుతాయి. అయితే అహ్మదాబాద్‌లోని పసిఫిక్ మాల్లో జరిగే దాండియా నైట్‌కు ఎంతో ఆదరణ ఉంది. బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలంటే రూ.399 చెల్లించాల్సి ఉంటుంది.వడోదర (గుజరాత్)వడోదరలో నిర్వహించే దాండియా నైట్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ దాండియా టిక్కెట్ల ధరలు రూ.400 నుండి రూ.500 వరకు ఉంటాయి. కొన్నిచోట్ల టిక్కెట్ ధర రూ. రెండువేలకు పైగానే ఉంటుంది.థానే (మహారాష్ట్ర)దాండియా వేడుకలు థానేలోని ఆక్ట్రాయ్ మైదానంలో జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఇక్కడి దాండియాకు గుర్తింపు ఉంది. దాండియా వేడుకలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ఈవెంట్లో పాల్గొనాలంటే ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర రూ.300.ఢిల్లీఢిల్లీలోని రాజ్వాడ ప్యాలెస్‌లో దాండియా నైట్ నిర్వహిస్తారు. ఇక్కడ దాండియా ప్లేస్ 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఎయిర్ కండిషన్డ్ ఏరియాలో దాండియా ఆడేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే దాండియాలో పాల్గొనేవారు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.బెంగళూరుబెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోనూ అత్యంత వేడుకగా దాండియా నైట్ నిర్వహిస్తారు. జేపీ నగర్లో జరిగే ఈ ఈవెంట్‌కు వెళ్లాలంటే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ ధర రూ. 100 వరకూ ఉంటుంది.ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు -
అటు దాండియా.. ఇటు మెహందీ.. కలర్ఫుల్గా అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
అనంత్ అంబానీ-రాధిక వెడ్డింగ్ : అదిరిపోయిన దాండియా నైట్ (ఫోటోలు)
-
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో దాండియా ఆడుతున్న హామ్స్టిక్ విద్యార్థులు (ఫొటోలు)
-
హైదరాబాద్ లో దాండియా సందడి (ఫోటోలు)
-
Fashion: ప్లెయిన్, ప్రింటెడ్, పట్టు శారీ.. కలంకారీ ప్రింట్లున్న బ్లౌజ్ సరైన ఎంపిక!
అమ్మవారి అలంకరణ రోజుకొక హంగుగా దర్శనమిస్తుంది. అమ్మవారి రూపంగా భావించే మహిళలూ ఈ వేడుకల్లో తమ ఆహార్యమూ అదిరిపోవాలనుకుంటారు. దాండియా ఆటపాటల్లో పాల్గొనడానికి ప్రతిరోజూ ప్రత్యేకమైన దుస్తుల ఎంపిక తప్పనిసరి అనుకుంటారు. అయితే, డ్రెస్ ఎంపిక కుదరడం లేదు అనుకున్నవారికి మనవైన కలంకారీ ప్రింట్లు ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అన్నిరకాల చీర కట్టుకు సరైన ఎంపిక అవుతుంది. రూపాన్ని కళగా మార్చేస్తుంది. ప్లెయిన్, ప్రింటెడ్, పట్టు శారీ ఏ మెటీరియల్ అయినా.. రంగులు భిన్నమైనా.. ఒక్క కలంకారీ బ్లౌజ్ తీరైన కళను తీసుకువస్తుంది. దీనికి సిల్వర్ జ్యువెలరీ సరైన ఎంపిక అవుతుంది. సాధారణ మోడల్ లేదా మోడర్న్ కట్, లాంగ్ జాకెట్ అయినా.. డిజైన్ల ఎంపికలో కలంకారీకి సాటి లేదన్నది ఈ వేడుకలో కనిపిస్తుంటుంది. కళగా ఉండాలనుకునేవారు కలంకారీ ధరిస్తే చాలు నవరాత్రుల్లో నవ్యంగా వెలిగిపోతారు. -
Dussehra 2022: నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ రెడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మరో వేడుకకు సిద్ధమవుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాలకు సమాయత్తమవుతోంది. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి అనంతరం నిమజ్జనం గావిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని ధూల్‌పేట్‌లో దుర్గామాత ప్రతిమల తయారీ పనులు ఊపందుకున్నాయి. కళాకారులు వీటికి రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. నగరం వేదికగా దసరా నవరాత్రి సందడి వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేదికగా ఆదివారం ప్రీ నవరాత్రి ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకల్లో సంప్రదాయ గర్బా నృత్యంతో పాటు దాండియాతో అలరించారు. నగరంలో దాండియా సందడి మొదలైంది. శిల్పి ఈవెంట్స్, ఎస్కే క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నగరంలోనే అతిపెద్ద ‘నవరాత్రి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాల్లో పాల్గొని, ఉత్తమంగా నృత్యం చేసిన వారికి రూ.25 లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామన్నారు. (క్లిక్: దాండియా జోష్...స్టెప్పులు అదరహో..) 26 నుంచి రామాయణ్ మేళా అబిడ్స్: ఈ నెల 26 నుంచి 50వ రామాయణ మేళా వేడుకలు నిర్వహిస్తున్నట్లు రామాయణ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్‌రాఠి పేర్కొన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రామాయణ మేళాలో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించి పలువురు కవులను సన్మానిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే రామాయణ్ మేళాలో ప్రతి రోజు రామాయణం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. 29 నుంచి 3వ తేదీ వరకు గర్బా దాండియా నిర్వహిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాండియా వేడుకలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. దసరా రోజు అక్టోబర్ 5న వేలాదిమంది భక్తుల మధ్య రావణ దహనం, శమీ పూజ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కమల్‌నారాయణ అగర్వాల్, గిరిధర్ లాల్, మనోజ్ జైస్వాల్, రామ్‌దేవ్, సుమిత్‌రాఠి పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు) -
కోలాహలమే ఆ ఆటంటే..
రెండు కర్రలు తాకడంతో శ్రావ్యంగా వినిపించే శబ్దం.. చీమల వరుస కదిలినట్లుగా లయబద్ధంగా సాగే ఆ నృత్యం.. కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఒకే రంగు వస్త్రాలతో మహిళల కదలికలు.. వెరసి కోలాటం.. ఆ ఆట ఇటీవలి కాలంలో ఎంతో ఆదరణ సంపాదించుకుంది. అధ్యాత్మిక కార్యక్రమమైనా.. పెళ్లి తంతు అయినా.. ఉత్సవాలు జరుగుతున్నా.. ఆ కోలాటం ఉంటే ఎంతో ఆకర్షణీయంగా మారుతోంది. ప్రస్తుతం ఎవరు కార్యక్రమం చేసినా కోలాటం ఉండేలా చూసుకుంటున్నారు. ఒకానొకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించిన ఈ నృత్యం ఇప్పుడు పట్టణాలకు, మహానగరాలకు పాకి ఆహూతులను అలరిస్తోంది. సాక్షి, పాల్వంచ : రెండు కర్రలతో సందడి చేసే కోలాట నృత్యం పాత తరంలో పల్లెల్లో మాత్రమే కనిపించేంది. నాటి సంప్రదాయ నృత్యం ప్రస్తుతం పట్టణాల్లోనూ క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. ఆధ్యాత్మిక కార్యాక్రమాలు ఎక్కడ జరిగినా అక్కడ కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఎంతో కనువిందు చేసేలా కోలాట నృత్యాలు ఆడుతుంటే నిల్చుని చూస్తుండి పోతాం. దైవ కార్యక్రమాలను మరింత శోభాయమానంగా మార్చుతుంటాయి. పాదం పాదం కలుపుతూ చేతుల్లోని కోలాట కర్రలను కొడుతూ (శబ్దం చేస్తూ) వారు చేసే ప్రదర్శన ఎంతో హృత్యంగా ఉంటుంది. ఇలాంటి కోలాట కార్యక్రమాలకు ప్రసిద్ధిగా మారింది పాల్వంచలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి హరే శ్రీనివాస కోలాట భజన మండలి. పాల్వంచ కొత్తగూడెం, విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, చిన్నతిరుపతి, పెద్దతిరుపతితో పాటు పలు ఆధ్యాత్మిక దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఈ కోలాట బృందం తమదైన శైలిలో నృత్య ప్రదర్శనలు ఇస్తూ పలువురి మన్ననలు పొందుతోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఉచితంగా పలువురికి శిక్షణ ఇస్తున్నారు. కోలాటంలో అందెవేసిన చేయి 2012లో పాల్వంచ వర్తక సంఘ భవనంలో సత్తుపల్లికి చెందిన అచ్యుత వాణి అనే శిక్షకురాలి వద్ద బేర శ్రీలక్ష్మి శిక్షణ తీసుకుని అనతి కాలంలోనే అనేక ప్రదర్శనలు ఇస్తూ ప్రాచుర్యం పొందారు. కోలాట నృత్యాల్లో మాలిక, రౌండ్ మాలిక, దేవుడి చుట్టూ ప్రదర్శన చేసి మాల వేయడం, కవ్వాయి, ఎదురుదండ, ప్రార్థన కోపు, గణపతి కోపు, నాగిని కోపు, కృష్ణుడి కోపు, హారతి కోపు, జడ కోపు, లోపలి దండ, పడవకోపు, అర్ధచక్రం, పునర్ఆహ్వానం, బెండు కోపు, బిందెల కోపు, లక్ష్మి కోపు, దుర్గమ్మ కోపు, విష్ణుచక్రం కోపు, భూమాతకు హారతి తదితర సుమారు 30 రకాల నృత్యాలు చేస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన కోలాటంపై నేడు పట్టణవాసులు సైతం మక్కువ చూపిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ ఆటను ఆడేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. 2014 నుంచి శ్రీలక్ష్మి పాత పాల్వంచ, పెద్దమ్మ తల్లి ఆలయం, శ్రీరామాలయ భజన మందిరంలో పలు కోలాట బృందాలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 200 మందిని ఈ నృత్యంలో తీర్చిదిద్దారు. ఆధ్యాత్మిక సేవలో.. తిరుపతిలో రథసప్తమి, బ్రహోత్సవాలు, భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వెంకటేశ్వరస్వామి కల్యాణం, రథయాత్రలు, శివరాత్రి, దసరా, వినాయకచవితి తదితర సందర్భాలతో పాటు ఎలాంటి దైవ సేవ కార్యక్రమాలు ఉన్నా కోలాట ప్రదర్శనలు ఇస్తుంటారు. కురుస్తున్న ప్రశంసలు నృత్య ప్రదర్శనలు ఇస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు బేర శ్రీలక్ష్మి. 2017లో పాత పాల్వంచలో గజ్జ పూజ సందర్భంగా రెండు సార్లు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా సన్మానం పొందారు. టీచర్స్‌డే నాడు వాసవీక్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సత్కారం పొందారు. ఈ ఏడాది భద్రాచలంలో జాతీయస్థాయి ‘ఆట’అవార్డును అందుకున్నారు. -
దాండియా జోష్
-
దాండియా.. అదిరెన్
-
దాండియా, గర్భాజోష్ వేడుకలు
-
‘వాటర్స్’లో దాండియా..
-
‘వాటర్స్’లో దాండియా..
జూబ్లీహిల్స్: నవరాత్రి ఉత్సవాల్లో సిటీ మునిగి తేలుతోంది. బంజారాహిల్స్‌లోని ‘వాటర్స్’లో ఆదివారం నిర్వహించిన ‘ఆక్వా గర్భా దాండియా’ సందడిగా సాగింది. మహిళలు నీటి కొలనులో ఆడిపాడుతూ ఆనందంగా గడిపారు. ఫిట్నెస్ ట్రైనర్ వేణు మందల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. -
హైదరాబాద్ గాట్ టాలెంట్ పోటీ షురూ...
-
దాండియా నైట్..
-
ఉత్సాహ్.. దాండియా
గుజరాతీల సంప్రదాయ నృత్యం దాండియాలో హైదరాబాదీయులు దుమ్ము రేపారు. దసరా నవరాత్రుల సందర్భంగా వజ్రా ఈవెంట్స్ బంజారాహిల్స్ ఆిషియానాలో గురువారం నిర్వహించిన ‘దాండియా ఫెస్ట్’లో ఉత్సాహంగా గడిపారు. శుక్రవారం కూడా కొనసాగే ఈ ఫెస్ట్‌లో దాండియా, గార్భా నృత్యాలే కాదు... పిల్లా, పెద్దా అంతా కలసి ఇక్కడి పండుగ షాపింగ్‌ను కూడా ఆస్వాదించారు. వారి ఆనందాన్ని ‘సిటీ ప్లస్’తో పంచుకున్నారు. అంతా కలసి... మా ఆఫీసులో నిర్వహించే కల్చరల్ ఈవెంట్స్‌లో పాల్గొంటా. అలా దాండియాతో పరిచయం ఏర్పడింది. మన హైదరాబాద్ మినీ భారత్. అందుకే ఈ సందడిని అన్ని రాష్ట్రాల వారితో కలసి చేసుకొంటాం. గుజరాతీల సంప్రదాయ దాండియా నేర్చుకొని వారితోనే ఆడటం మంచి అనుభూతి. - చంద్రిక, ఐటీ ఉద్యోగిని ఎంజాయ్ చేస్తా... నాకు కూచిపూడిలో కొంత ప్రవేశం ఉంది. ఉత్తర భారత సంప్రదాయ నాట్యం ఇక్కడి వారితో మమేకం అయిపోయింది. ఒకరి సంస్కృతిని ఒకరు పంచుకున్నప్పుడే స్నేహభావం పెంపొందుతుంది. ఏదేమైనా... దాండియాను బాగా ఎంజాయ్ చేస్తా. - శ్రీలలిత, ఎంఎన్సీ ఉద్యోగిని మధురానుభూతి... మాది చెన్నై. రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాం. దాండియా అపరిచితులను ఒక చోటికి తెస్తుంది. స్నేహ బంధం వేస్తుంది. నా కుమార్తెకు డ్యాన్స్ చాలా ఇష్టం. తన కోసమే ఇక్కడకు వచ్చా. నిజంగా ఇది ఓ మధురానుభూతి. ఉండబట్ట లేకో... మరేదన్నా ఊహించుకున్నాడో గానీ... ‘టెరెన్స్ లూయీస్‌తో మీరు డేటింగ్ చేస్తున్నారట కదా’ అని టీవీ స్టార్ సయంతాని ఘోష్‌ను ఠక్కున అడిగేశాడొకాయన. మరీ అంత డెరైక్ట్ ప్రశ్నకు లోపల ఎలా ఫీలైనా... బయటకు మాత్రం ‘అలాంటిదేమీ లేద’ంటూ కూల్‌గా బదులిచ్చిందీ భామ. ‘మేమిద్దరం కలిసి కాఫీకో, డిన్నర్‌కో వెళ్లాలని ఏడాదిగా ప్లాన్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కుదరలేదు. మా ఇద్దరి గురించీ చాలాచాలానే రాస్తున్నారు. కానీ కలిసింది లేదు’ అంటూ గోడు వెళ్లబోసుకుంది. - గాయత్రి -
ఉత్సవాలకు బందోబస్తు
సాక్షి, ముంబై: నవరాత్రులను పురస్కరించుకుని దాండియా నృత్య వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా నగర పోలీసులు డేగ కన్ను వేశారు. ఆకతాయిల ఆటకట్టేందుకు పోలీసు శాఖకు చెందిన యాంటీ ఈవ్‌టీజింగ్ బృందాలను నియమించారు. ప్రస్తుతం వీరంతా నగరంతోపాటు పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో దాండియా ఉత్సవాలు జరుగుతున్న చోట మారువేషాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బోరివలి, మలాడ్, ఘాట్కోపర్, ములుండ్ తదితర శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాండియా, గర్భా నృత్య కార్యక్రమాలు ఏర్పాటుచే స్తారు. ఇక్కడ జన ం రద్దీ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం మహిళలు పాల్గొనడంవల్ల ఈవ్‌టీజింగ్ లేదా అసభ్యకరంగా ప్రవర్తించడం, చోరీలు లాంటి ఘటనలు జరుగుతుంటాయి. వీటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా నియమించిన పోలీసులు నిఘా వేశారు. అందుకు అవసరమైన అదనపు పోలీసు బలగాలను కూడా తెప్పించారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసుల వారాంతపు సెలవులు రద్దు చేశారు. గణేశ్ ఉత్సవాల కారణంగా దాదాపు 25 రోజులపాటు పోలీసులు, అధికారుల వారాంతపు, దీర్ఘకాలిక సెలవులను హోం శాఖ రద్దుచేసింది. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులకు ఇటీవలే విశ్రాంతి లభించింది. కాని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో మళ్లీ వారాంతపు సెలవులు రద్దయ్యాయి. దాదాపు 20 వేల మంది పోలీసులు నగర రహదారులపై గస్తీ నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా క్విక్ రెస్పాన్స్ టీం మూడు బెటాలియన్లు, హోం గార్డులు, స్టేట్ రిజర్వుడు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ముంబై పోలీసు దళానికి చెందిన ప్రతినిధి, డిప్యూటీ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌదరి చెప్పారు. కాగా భారీగా దాండియా కార్యక్రమం ఏర్పాటుచేసే నిర్వాహకులు సాధ్యమైనన్ని సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని పోలీసులు అదేశించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆకతాయిలు లోపలికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. -
కరీంనగర్లో దాండియా నృత్యాలు