
దసరా నవరాత్రి ఉత్సవాలు ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దసరా వేడుకలను నిర్వహించుకుంటారు. దేశంలోని అనేక నగరాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట విశేషంగా నిలిచాయి.
పాకిస్తాన్‌లో నివాసం ఉంటున్న ఇండియన్ ప్రీతం దేవ్రియా ఈ వీడియోను షేర్ చేశారు. అక్కడి భారతీయ భక్తులు గర్బా, దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరాచీ నుండి మరొక వీడియో, ధీరజ్ షేర్ చేసిన మరో వీడియోలు కూడా దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఇవిద్యుత్ దీపాలతో అలంకరించిన ఒక వీధిలో దుర్గామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం విశేషం. ముస్లింలు ఎక్కువగా నివసించే పాక్‌లో నవరాత్రి సంబరాలు ప్రత్యేకంగా నిలిచాయి. వ సోషల్ మీడియా వినియోగదారులు పాకిస్తాన్‌లోని హిందూ సమాజం గురించి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఉత్సుకతతో స్పందించారు.పాకిస్తాన్‌లో శాకాహారులు , జైనులు ఉన్నారా అని అడిగినప్పుడు, ప్రీతమ్ దేవ్రియా ఉన్నారని ధృవీకరించారు. ఈ వేడుకలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు. పలువురు వారికి "నవరాత్రి శుభాకాంక్షలు" అందించారు.