Photo Credit: BCCI Twitter
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో సెంచరీ బాదడం ద్వారా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే టీ20ల్లో చేజింగ్‌లో భారత్ తరఫున సెంచరీ సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. తాజాగా శ్రేయస్ మరో ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు.
అదేంటంటే.. తాజా సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) శతకాలు బాదిన ఏడో క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో టీమిండియా తరఫున విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, యశస్వి జైస్వాల్‌లు ఈ ఫీట్ సాధించారు.
👉దీంతో పాటు మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఫుల్ టీం మెంబర్ కెప్టెన్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఐదో బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. విండీస్‌తో టీ20లో అయ్యర్ 42 బంతుల్లో సెంచరీ సాధించి హ్యారీ బ్రూక్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.
జింబాబ్వే తరఫున సికందర్ రజా (2024లో 33 బంతుల్లో జాంబియాపై) శతకం సాధించి తొలి స్థానంలో నిలవగా, రోహిత్ శర్మ (2017లో శ్రీలంకపై 35 బంతుల్లో శతకం) రెండో స్థానంలో, ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (2026లో శ్రీలంకపై 42 బంతుల్లో) మూడు, సౌతాఫ్రికా తరఫున డుప్లెసిస్ (2015లో వెస్టిండీస్‌పై 46 బంతుల్లో) నాలుగో స్థానాల్లో ఉన్నారు.
👉లక్నో వేదికలో శ్రేయస్ అయ్యర్‌కు మంచి రికార్డు ఉంది. ఈ వేదికలో శ్రేయస్ అయ్యర్ ఐదు మ్యాచ్‌లు ఆడితే అందులో ఒకసారి మాత్రమే ఔటవ్వగా.. మిగతా నాలుగుసార్లు అజేయంగా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. తాజాగా విండీస్‌పై సెంచరీ బాదిన శ్రేయస్.. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 51 బంతుల్లో శతకం సాధించాడు. ఓవరాల్‌గా లక్నో వేదికగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 335 పరుగులు చేసిన శ్రేయస్ ఖాతాలో 32 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి.
👉ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చేజింగ్‌లో టీమిండియా తరఫున శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ నెలకొల్పిన 137 పరుగుల అజేయ భాగస్వామ్యం మూడో అత్యుత్తమంగా నిలిచింది. గతంలో జైస్వాల్-గిల్ రెండుసార్లు (165 పరుగులు వర్సెస్ వెస్టిండీస్‌పై, 2023లో), (156 పరుగులు అజేయ భాగస్వామ్యం వర్సెస్ జింబాబ్వేపై 2024లో) ఈ ఫీట్ నమోదు చేశారు.
No better way to bring up your maiden T20I ton! 🤩 🎥 Relive Captain Shreyas Iyer's 𝙢𝙞𝙡𝙚𝙨𝙩𝙤𝙣𝙚 𝙢𝙤𝙢𝙚𝙣𝙩 🔥 Updates ▶️ https://t.co/2czVyKWreK #TeamIndia | #INDvWI | @mflone_ | @ShreyasIyer15 https://t.co/LGOfKb5SYx
— BCCI (@BCCI) October 6, 2026
ఇదీ చదవండి:


