breaking news
Three formats
-
'శుబ్'సమయం ఆసన్నమైందా?
టీమిండియా త్వరలో ఆసియాకప్ టి20 సిరీస్ ఆడనుంది. మంగళవారం నాడు జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. టెస్ట్ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేస్తారా, లేదా అనే చర్చ జరుగుతోంది. ఇదిలావుంచితే నాయకత్వంపై కూడా డిస్కషన్ నడుస్తోంది. టి20 టీమ్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఉన్నాడు కదా, ఇంక డిస్కషన్ ఏముంది అంటారా? దీని గురించి కాదు. మూడు ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్‌గా ఉండాలనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు గుడ్ బై చెప్పినప్పుడు జట్టు పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై పెద్ద కసరత్తే జరిగింది. బుమ్రా కెప్టెన్సీ నిరాకరించడంతో కేఎల్ రాహుల్ టెస్ట్ టీమ్ సారథి అవుతాడని చాలా మంది అనుకున్నారు. అనూహ్యంగా సెలక్షన్ కమిటీ శుబ్‌మన్ గిల్‌వైపు మొగ్గు చూపింది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికే బీసీసీఐ ఓటు వేసింది. కెప్టెన్ హోదాలో ఇంగ్లీషు గడ్డపై లాంగ్ ఫార్మాట్ ఆడిన గిల్.. అంచనాలకు మించి ఆడడంతో అతడిపై భ్రమలు తొలగిపోయాయి. అందరి కంటే ఎక్కువ పరుగులు సాధించడంతో పాటు సిరీస్‌ను సమం చేయడంతో గిల్ నాయకత్వ పటిమపై భారత్ క్రికెట్ అభిమానులకు నమ్మకం కుదిరింది.రోహిత్ తర్వాత అతడికే..ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లకు ఒక్కరే కెప్టెన్ ఉంటే బాగుంటుందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం వన్డే జట్టుకు రోహిత్ శర్మ, టీ20 టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా గిల్ ఉన్నారు. రోహిత్‌కు వయసు మీద పడుతుడడంతో అతడు ఎంతకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2027లో సౌతాఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి హిట్‌మాన్‌కు 40 ఏళ్లు నిండుతాయి. అప్పటి వరకు జట్టులో ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతాడని కొంతమంది నమ్ముతున్నారు. దీంతో గిల్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించే చాన్స్ ఉందని విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. వన్డేల్లో గిల్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి రోహిత్ తర్వాత కెప్టెన్సీ చాన్స్ అతడికేనని విశ్లేషిస్తున్నారు.స్కై డిప్యూటీగా గిల్?టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ నుంచి కోలుకుని ఆసియా కప్ (Asia Cup 2025) ఆడేందుకు రెడీ అవుతున్నాడు. అతడికి డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరిస్తున్నాడు. జట్టు సుదీర్ఘ ప్రయోజనాలను లెక్కలోకి తీసుకుని అక్షర్‌ను టి20 టీమ్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. గిల్‌ను సూర్యకుమార్‌కు డిప్యూటీగా నియమించి మూడు ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతలు మోసేలా తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది టి20 వరల్డ్‌కప్ నాటికి మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా గిల్‌ను నియమించేలా కసరత్తు జరుగుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.మూడింటికి ఒక్కరే బెస్ట్గత ఫలితాలు చూసుకుంటే మూడు ఫార్మాట్లకు కెప్టెన్ ఒక్కరే ఉన్నప్పుడు టీమిండియా మంచి ఫలితాలు సాధించింది. ఎంఎస్ ధోని పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 2007లో మన జట్టు టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2011లో అతడిని మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అప్పగించడంతో.. అదే ఏడాది టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. ధోని నాయకత్వంలోనే 2013లో ఇంగ్లీషు గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడే 2024లో రెండోసారి టి20 ప్రపంచకప్ విజేత కాగలిగింది. 2015- 17 మధ్య కాలంలో టీమిండియాకు ఇద్దరు నాయకత్వం వహించారు. పొట్టి ఫార్మాట్‌కు ధోని, టెస్టులకు కోహ్లి సారథులుగా ఉన్నారు.సేమ్ సిట్యుయేషన్ధోని నుంచి కోహ్లికి వన్డే కెప్టెన్సీ బదలాయింపు సులువుగానే జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియాతో నేషనల్ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ చెప్పారు. 'అప్పటికే టెస్టు కెప్టెన్‌గా కోహ్లి దూసుకుపోతున్నాడు. వన్డేల్లోనూ బాగా ఆడుతున్నాడు. అదే సమయంలో ధోని.. రిటైర్మెంట్కు ముందు కొద్ది రోజులు ఎటువంటి బాధ్యతలు లేకుండా క్రికెట్ ఆడాలని భావించాడు. దీంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ధోని నుంచి కోహ్లికి నాయకత్వ బాధ్యతల బదలాయింపు జరిగింది. ఇప్పుడు గిల్‌కు కూడా అలాంటి పరిస్థితి ఉంద'ని దేవాంగ్ గాంధీ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలం భారత క్రికెట్‌ను గిల్ ఏలుతాడని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం.చదవండి: ఇషాన్ కిషన్ అవుట్.. కారణం ఇదేవర్క్లోడ్ తట్టుకోగలరా?ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లకు ఇద్దరేసి కెప్టెన్లు ఉన్నారు. మూడు ఫార్మాట్లకు ఒకరే కెప్టెన్‌గా ఉంటే వర్క్‌లోడ్ తట్టుకోగలరా అనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే బౌలర్లతో పోలిస్తే బ్యాటర్లపై కెప్టెన్సీ భారం తక్కువగా ఉంటుందని భారత్ స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ మాజీ కోచ్ రాంజీ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా గిల్‌కు ఉంది కాబట్టి అతడికిది సానుకూల అంశం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి గిల్‌ను సూర్యకుమార్ డిప్యూటీ నియమిస్తే అతడికి అనుభవం పెరుగుతుందని, గిల్‌ను పరీక్షించడానికి వచ్చే టి20 ప్రపంచకప్ వరకు తగినంత సమయం కూడా ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో! -
'సూర్య లేకుంటే మూడు ఫార్మాట్లు లేనట్లే'
గతేడాది టి20ల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గానూ టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. టి20ల్లో ఇప్పటికే సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ వన్డేల్లోనూ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌కు కూడా సూర్య ఎంపికయ్యాడు. ఒకవేళ తుదిజట్టులోకి ఎంపికైతే మాత్రం మూడు ఫార్మాట్లు ఆడిన క్రికెటర్‌గా సూర్యకుమార్ నిలవనున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో పేరు తెచ్చుకున్న సూర్య టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూర్యకుమార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు." కచ్చితంగా సూర్యకుమార్ ఆడుతున్న తీరు చూస్తుంటే.. అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉండాల్సిందేనని భావిస్తున్నా. అతడు లేకపోతే మూడు ఫార్మాట్లూ ఉండవు. అతని ఆటతీరు, సంకల్పం, షాట్లు ఆడే తీరు నాకు చాలా ఇష్టం. పైగా ఎలాంటి భయం లేకుండా ఆడడం అతని నైజం. గ్రౌండ్ కొలతలను తనకు తగినట్లుగా మార్చుకోగలడు. అతడు ముంబై ప్లేయర్. రెడ్ బాల్ క్రికెట్ ఎలా ఆడాలో అతనికి తెలుసు. అతనికిది గొప్ప అవకాశం. టెస్టు క్రికెట్ ఆడటం వల్ల వన్డే టీమ్ లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు. తర్వాత ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయగలడు" అని రైనా అన్నాడు. ఇక ఇదే చర్చలో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా రైనా వ్యాఖ్యలతో ఏకీభవించాడు. "కచ్చితంగా అతడు టెస్టు టీమ్ లో ఉండాలి. సూర్య ఆడిన తీరు చూస్తే అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉండాలి. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందో నాకు తెలుసు. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తుంది. కానీ అతనికి కూడా టైమ్ వస్తుంది. కానీ సూర్య టెస్టు టీమ్ లో ఉండటానికి 100 శాతం అర్హుడు" అని ఓజా స్పష్టం చేశాడు. ఇక ఏడాది కాలంగా ఇండియన్ క్రికెట్ లో మార్మోగుతున్న పేరు సూర్యకుమార్ యాదవ్. వేగానికి మారుపేరైన సూర్యను టెస్టులకు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. టాప్ ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ బదులు సూర్యకు చోటివ్వడమేంటని మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: అభిమానులనుద్దేశించి సూర్యకుమార్ ఎమోషనల్ పోస్టు -
Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్‌లు..!
Anil Kumble: టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో టీమిండియా సక్సెస్ సాధించేందుకు తోడ్పడే కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఫాలో అవుతున్న.. '3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు' అనే ఫార్ములాను టీమిండియా కూడా ఫాలో అవ్వాలని సూచించాడు. 2021లో ఆసీస్.. తాజాగా ముగిసిన వరల్డ్‌కప్ (2022)లో ఇంగ్లండ్ సక్సెస్ మంత్ర ఇదేనని పేర్కొన్నాడు. టెస్ట్‌ల్లో , పరిమిత ఓవర్ల క్రికెట్లో వేర్వేరు కోచ్‌లు, వేర్వేరు కెప్టెన్లతో ఇంగ్లండ్ జట్టు అద్భుత ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న చర్చపై కుంబ్లే తన అభిప్రాయాన్ని ఈమేరకు వెల్లడించాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు, ముగ్గురు కోచ్‌లు ఉండాలని కచ్చితంగా చెప్పలేను కానీ, జట్టు మాత్రం డిఫరెంట్‌గా (ఆయా ఫార్మాట్లలో స్పెషలిస్ట్‌లతో కూడిన జట్టు) ఉంటే తప్పక సత్ఫలితాలు వస్తాయని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ముఖ్యంగా టీ20లకు ప్రత్యేక జట్టు చాలా అవసరమని, ఈ ఫార్మాట్లో హార్డ్ హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, టీ20 స్పెషలిస్ట్‌ల పాత్ర చాలా కీలకమని, 2021 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, తాజాగా ముగిసిన వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఈ ఫార్ములా అమలు చేసే విజయాలు సాధించాయని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టులో లివింగ్‌స్టోన్, ఆసీస్ టీమ్‌లో స్టొయినిస్ లాంటి ఆటగాళ్లు 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నారంటే, ఆయా జట్ల కూర్పు ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతుందని ఉదహరించాడు. కుంబ్లే చేసిన ఈ ప్రతిపాదనకు ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ కూడా మద్దతు పలికాడు. అన్ని జట్లు ఈ విషయం గురించి సీరియస్‌గా ఆలోచించాలని సూచించాడు. కాగా, విశ్వవిజేత ఇంగ్లండ్ జట్టుకు టెస్ట్‌ల్లో, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వేర్వేరు కోచ్‌లు, కెప్టెన్లు, జట్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టుకు టెస్ట్‌ల్లో బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్‌గా, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాథ్యూ మాట్ కోచ్‌గా, జోస్ బట్లర్ కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20ల్లో మాజీ ఛాంపియన్ అయిన ఆసీస్‌కు టెస్ట్‌ల్లో, లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో వేర్వేరు కోచ్‌లు లేనప్పటికీ.. కెప్టెన్లు (కమిన్స్, ఫించ్), జట్టు పూర్తిగా వేరుగా ఉంది. టీమిండియా విషయానికొస్తే.. మన జట్టు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ (రోహిత్ శర్మ), ఒకే కోచ్ (ద్రవిడ్), ఇంచుమించు ఒకే జట్టు కలిగి ఉంది. అప్పుడప్పుడు అంతగా ప్రాధాన్యత లేని సిరీస్‌లకు రెస్ట్ పేరుతో కెప్టెన్‌కు, కోచ్‌కు రెస్ట్ ఇస్తుంది. ఆ సమయంలో కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తుంటాడు. కెప్టెన్ల మాట చెప్పనక్కర్లేదు. రోహిత్ గైర్హాజరీలో ఒక్కో సిరీస్‌కు ఒక్కో ఆటగాడు కెప్టెన్‌గా పని చేశాడు. గత ఏడాది కాలంలో భారత్ ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది. చదవండి: ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..! -
ఢిల్లీని వదిలేయనున్న వీరూ!
డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ క్రికెట్ జట్టుతో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికే ఆలోచనలో ఉన్నాడు. ఢిల్లీ జట్టులో కొత్త కుర్రాళ్లకు అవకాశాలు దక్కేందుకు గాను తాను మరో క్రికెట్ జట్టును ఎంచుకోవాలని భావిస్తున్నాడు. వీరూకు ఇప్పటికే పలు రాష్ట్రాల రంజీ జట్ల నుంచి ఆఫర్లు ఉన్నాయి. ఢిల్లీ తరఫున అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా సెహ్వాగ్‌కు పేరుంది. మూడు ఫార్మాట్లలో కలిపి 17 వేలకు పైగా పరుగులు సాధించాడు.