మెస్సీ పునరాగమనం అదిరింది..! | Lionel Messi Makes Promising Comeback, Scores First Goal Since Fathers Death | Sakshi
Sakshi News home page

మెస్సీ పునరాగమనం అదిరింది..!

Aug 20 2026 9:00 AM | Updated on Aug 20 2026 9:50 AM

Lionel Messi Makes Promising Comeback, Scores First Goal Since Fathers Death

source: X

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తండ్రి మరణం తాలూకా విషాదం నుంచి బయటపడ్డాడు. మేజర్ లీగ్ సాకర్ (MLS)లో భాగంగా ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ గోల్‌తో పాటు ఓ అసిస్ట్‌ చేసి ఘనంగా పునరాగమనాన్ని చాటుకున్నాడు. తండ్రి జార్జ్ మెస్సీ మరణం తర్వాత మెస్సీ సాధించిన తొలి గోల్‌ ఇదే. మెస్సీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినప్పటికీ.. అతడి జట్టు ఇంటర్‌ మయామీకి విజయం​ దక్కలేదు. ఈ మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది.

కాగా, ఆగస్టు 7న మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ మరణించారు. దీంతో అతడు ఆగస్టు 8న జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అంత్యక్రియల కోసం అర్జెంటీనాకు వెళ్లిన అతడు ఆగస్టు 12న లియోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగి 45 నిమిషాలు ఆడాడు. తాజాగా ఫిలడెల్ఫియాతో పూర్తి మ్యాచ్ ఆడి మునుపటి ఫామ్‌ను చాటుకున్నాడు. తండ్రి మరణం తర్వాత తీవ్ర భావోద్వేగ పరిస్థితుల్లో మైదానంలోకి తిరిగొచ్చిన మెస్సీకి ఈ మ్యాచ్‌ ప్రదర్శన చాలా ప్రత్యేకమైనది.

అద్భుతమైన ఫామ్‌
ఈ సీజన్‌లో మెస్సీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. MLSలో 17 మ్యాచ్‌ల్లో  13 గోల్స్, 9 అసిస్టులు నమోదు చేశాడు. ఫిలడెల్ఫియాపై ఆరు మ్యాచ్‌ల్లోనే ఆరు గోల్స్, నాలుగు అసిస్టులు సాధించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement