Photo Credit : Instagram
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జార్జినా రోడ్రిగెజ్‌తో పదేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన రొనాల్డో మంగళవారం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తన పెండ్లి విషయాన్ని రొనాల్డో స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫొటోలను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.
కాగా రొనాల్డో షేర్ చేసిన ఫొటోలో అతడు, జార్జినా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని కనిపించారు. ఇద్దరి చేతులకు వివాహ ఉంగరాలు ఉన్నాయి. ఈ ఫొటోతోనే తమ వివాహాన్ని రొనాల్డో అధికారికంగా వెల్లడించారు. 'సీ లవ్స్ జీ' అంటూ ఎమోజీ జత చేసి క్యాప్షన్ ఇచ్చాడు. క్రిస్టియానో, జార్జినా పేర్లలోని తొలి అక్షరాలతో ఈ క్యాప్షన్ రూపొందించాడు. రొనాల్డో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఫుట్‌బాల్ అభిమానులు, ఆటగాళ్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

2016లో చిగురించిన ప్రేమ
క్రిస్టియానో రొనాల్డో, జార్జినాల మధ్య 2016లో ప్రేమ చిగురించింది. మాడ్రిడ్‌లోని ఒక గూచీ స్టోర్‌లో జార్జినా సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో రొనాల్డో ఆమెను మొదటిసారి కలిశాడు. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో మళ్లీ కలుసుకున్నఈ జంట డేటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమంగా తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టారు. 2017 జనవరిలో జ్యూరిచ్‌లో జరిగిన 'ది బెస్ట్ ఫీఫా ఫుట్‌బాల్ అవార్డ్స్'లో వారు మొదటిసారి అధికారికంగా కలిసి కనిపించారు. ఆ తర్వాత అదే సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌లో తమ మొదటి జంట ఫోటోను పంచుకున్నారు.
2017 నవంబర్‌లో ఈ ప్రేమికులకు కుమార్తె అలనా మార్టినా పుట్టింది. అలనాను పెంచడంతో పాటు, క్రిస్టియానో జూనియర్, ఇవా, మాటియోల పెంపకంలో రోడ్రిగ్జ్ బిజీగా మారిపోయింది. 2022 ఏప్రిల్‌లో, ఈ దంపతులు కవల కుమార్తెలకు స్వాగతం పలికారు. ఇక 2025 ఆగస్టులో జార్జినా రోడ్రిగ్జ్ రొనాల్డో తొడిగిన ఉంగరాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘నీ ప్రొపోజల్‌కు అంగీకరిస్తున్నా’ అని క్యాప్షన్ జత చేసి నిశ్చితార్థం జరిగినట్లు ధృవీకరించింది.

ఇక రొనాల్డో ఇటీవలే ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ తరఫున ఆడాడు. అయితే జట్టును ఫైనల్ చేర్చడంలో విఫలమయ్యాడు. ఈసారి ప్రిక్వార్టర్స్‌లోనే పోర్చుగల్ వెనుదిరిగింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డో వయసు 41 ఏళ్లు. కాబట్టి రొనాల్డో తన కెరీర్‌లో చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడేసినట్లే.
❤️💍 A love story written in the stars. Cristiano Ronaldo and Georgina Rodríguez have officially said “I do.” 🥹✨
From years of love and memories to forever together — congratulations to the beautiful couple! 👰🏻♀️🤵🏼♂️❤️
Cristiano & Georgina — forever starts now. 🥂💍 https://t.co/5KMHsOO3Xf pic.twitter.com/XibMSyFY2I— Obuasimayor (@obua24) August 11, 2026
Cristiano Ronaldo shared this photo on his social media 💍❤️
(via @cristiano) pic.twitter.com/thMTwW6LOU— ESPN FC (@ESPNFC) August 11, 2026


