రొనాల్డో, జార్జినా వివాహం వెనుక షాకింగ్‌ ట్విస్ట్‌! | Cristiano Ronaldo and Georgina Rodriguez Married: Financial Clause Details | Sakshi
Sakshi News home page

రొనాల్డో, జార్జినా వివాహం వెనుక షాకింగ్‌ ట్విస్ట్‌; ఆలస్యంగా వెలుగులోకి!

Aug 14 2026 12:46 PM | Updated on Aug 14 2026 1:00 PM

Cristiano-Ronaldo Married-Georgina-Under-Financial-Clause-Deatils

Photo Credit: Twitter

పోర్చుగ‌ల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆగ‌స్టు 11న త‌న లాంగ్‌టైమ్ గ‌ర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీరి వివాహం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు స‌మ‌క్షంలో ఒక ప్రైవేట్ వేడుక‌లా జ‌రిగింది. అయితే రొనాల్డో, జార్జినా వివాహం వెనుక దాగున్న ఆస‌క్తిక‌ర విష‌యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఆర్ధిక నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌తో రొనాల్డో, జార్జినా వివాహం జ‌రగడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. వివాహ ధృవీక‌ర‌ణ పత్రంలోని వివ‌రాల ప్ర‌కారం, రొనాల్డో, జార్జినాలు 'ఆస్తి విభజన' చట్రం కింద వివాహం చేసుకున్నారు. ఈ లెక్క‌న వీరిద్ద‌రు త‌మ వ్య‌క్తిగ‌త ఆస్తుల‌పై ఎవ‌రికి వారే పూర్తి నియంత్ర‌ణ క‌లిగి ఉంటార‌ని పోర్చుగీసు చ‌ట్టం చెబుతోంది.

పోర్చుగీసు చట్టం ప్రకారం..
పోర్చుగీస్ చ‌ట్టం ప్ర‌కారం ఇలాంటి ఏర్పాటు వ‌ల్ల వివాహానికి ముందు, లేదా వివాహ స‌మ‌యంలో ఇరుపక్షాల్లో ఎవ‌రైనా సంపాదించిన ఆస్తులు, సంపాద‌న‌పై వారికే పూర్తి హ‌క్కులు ఉండేలా రూపొందించ‌డం జ‌రుగుతుంది. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో పెళ్లి చేసుకున్న దంప‌తులు విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ ఆస్తుల విభ‌జ‌నలో హ‌క్కు మాత్రం ఇద్ద‌రికి స‌మానంగా ఉంటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కు ఒప్పందం ప్ర‌కారం రొనాల్డో త‌న ఆదాయ వ‌న‌రుల్లో కాంట్రాక్టులు, ఎండార్స్‌మెంట్లు, వ్యాపార సంస్థ‌ల నుంచి వ‌చ్చే ఆదాయంతో పాటు తాను ఆడుతున్న ఫుట్‌బాల్ క్ల‌బ్ స‌హా సీఆర్‌7 హోట‌ల్ చైన్‌లో అత‌డికి వ‌చ్చే మొత్తం సంపాద‌న మొత్తంగా అత‌డికే చెందుతాయి త‌ప్ప జీవిత భాగ‌స్వామి జార్జినాకు పొందే అవ‌కాశం ఉండ‌దు.

విడిపోతే నెలకు రూ. కోటి చెల్లింపు
అయితే ఒక‌వేళ భ‌విష్య‌త్తులో రొనాల్డో, జార్జినా విడిపోతే పోర్చుగీసు చ‌ట్టంలోని మొద‌టి నిబంధ‌న ప్ర‌కారం జార్జినాకు రొనాల్డో నుంచి 100,000 యూరో మిలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 1.10 కోట్లు) ఫించ‌న్ రూపంలో అందుకుంటుంది. మ‌రో నిబంధ‌న ప్ర‌కారం మాడ్రిడ్‌లోని లా ఫింకాలోని రొనాల్డోకు చెందిన విలాస‌వంత‌మైన భ‌వ‌నంపై మాత్రం జార్జినా పూర్తి యాజ‌మాన్య హ‌క్కు క‌లిగి ఉంటుంది. 

ప్రస్తుతం ఈ భ‌వ‌నం ఆస్తి విలువ 5.6 మిలియ‌న్ డాల‌ర్లు (సుమారు రూ. 53.50 కోట్లు)గా ఉంది. ఇక రొనాల్డో, జార్జినా వివాహం వారి ఐదుగురు పిల్ల‌లు, కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో సీక్రెట్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి వివాహానికి రొనాల్డో స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు కానీ, తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అల్‌-న‌స్ర్ క్ల‌బ్ స‌హ‌చ‌రులు కానీ, సెల‌బ్రెటీలు ఎవ‌రూ హాజ‌రుల కాలేదు. మ‌రో విష‌య‌మేంటంటే, వీరి పెళ్లి జ‌రిగిన‌ప్ప‌టికీ, ఈ ఇద్ద‌రు త‌మ ఇంటిపేర్ల‌ను మార్చుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు.

Read: తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్న‌ర్లతో.. స‌ర్ఫ‌రాజ్‌కు చాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement