breaking news
Georgina Rodriguezs
-
పిల్లల్ని దత్తత ఇచ్చిన రొనాల్డో?!
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం, క్రిస్టియానో రొనాల్డో ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లుగా సహజీవనం చేస్తున్న జార్జినా రోడ్రిగ్స్‌తో అధికారికంగా వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తాము తొలిసారి కలిసిన రోజు గుర్తుగా ఆగష్టు 11న పిల్లల సమక్షంలో తమ విలాసవంతమైన ఇంట్లోనే 41 ఏళ్ల రొనాల్డో- 32 ఏళ్ల జార్జినా పెళ్లి ప్రమాణాలు చేశారు.ముగ్గురు పిల్లల తండ్రికాగా జార్జినాతో పరిచయం కంటే ముందే.. రొనాల్డో తండ్రైన సంగతి తెలిసిందే. 2010లో తన తొలి సంతానం జూనియర్ రొనాల్డోను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించిన ఈ పోర్చుగల్ దిగ్గజం.. అతడి తల్లి వివరాలు మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉంచాడు. జూనియర్ తర్వాత సరోగసి ద్వారా 2017లో రొనాల్డో మరో ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. వారి పేర్లు ఇవా మారియా, మేటియో. వీరిద్దరు కవలలు.మొత్తం ఆరుగురు.. ఒకరు ఈ లోకంలో లేరుఇక 2016లో జార్జినాను తొలిసారి కలిసిన రొనాల్డో స్వల్ప కాలంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. సహజీవనం చేసే క్రమంలో వీరికి తొలుత కుమార్తె అలనా మార్టినా జన్మించింది. ఇక 2022లో ఈ జంటకు కవల పిల్లలు కుమార్తె బెల్లా ఎస్మెరల్డా, కుమారుడు ఏంజెల్ జన్మించారు. కన్నతల్లిలాకానీ దురదృష్టవశాత్తూ ఏంజెల్ పుట్టిన కాసేపటికే మరణించాడు. అయితే, రొనాల్డో జీవితంలోకి వచ్చిన నాటి నుంచే జార్జినా అతడి పిల్లలకు తల్లైపోయింది. జూనియర్ రొనాల్డో, ఇవా, మేటియోలను కన్నతల్లిలా వారి ఆలనాపాలనా చూసుకుంటోంది.ముఖ్యంగా ఫుట్‌బాలర్‌గా జూనియర్ ప్రతీ ఈవెంట్లోనూ జార్జినా పాల్గొంటుంది. అతడిని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ.. ‘నా కుమారుడు ఇలాగే ఉంటాడు’ అంటూ అతడి చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేస్తుంది. తన సొంతపిల్లలతో పాటు రొనాల్డోకు తొలుత జన్మించిన ముగ్గురి పిల్లల పట్ల ఆమె ప్రేమగానే ఉంటుంది. పిల్లల దత్తతఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత జార్జినా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ రొనాల్డో, ఇవా, మేటియోలను ఆమె దత్తత తీసుకున్నట్లు పోర్చుగీస్ మీడియా వెల్లడించింది. ఈ ముగ్గురికి చట్టబద్ధంగా తల్లయ్యేందుకు జార్జినా ఈ మేరకు తన ఆలోచనను రొనాల్డోతో పంచుకోగా.. అతడు ఇందుకు సమ్మతించినట్లు సమాచారం. అయితే, దత్తత విషయాన్ని రొనాల్డో దంపతులు రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.బిడ్డల్ని కంటూనే ఉంటాం!ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత ‘వోగ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జార్జినా- రొనాల్డోకు భవిష్యత్తులో మరింత మంది పిల్లల్ని కంటారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు రొనాల్డో బదులిస్తూ.. ‘పిల్లల్ని కనేందుకు నేను ఎప్పుడూ నో చెప్పను’ అని నవ్వేశాడు. ఇక జార్జినా స్పందిస్తూ.. ‘ఇప్పటికే మా ఇల్లు పిల్లలతో నిండిపోయింది. అయితే, మా చిన్నారి పిల్లాడు 16వ వసంతంలోకి అడుగుపెట్టేశాడు. నిజానికి ఇంట్లో చిన్న పిల్లలు లేకుంటే నాకేమీ తోచదు. కాబట్టి పిల్లల్ని కనము అని మాత్రం చెప్పలేము’ అని జార్జినా నవ్వులు చిందించింది. కాగా రొనాల్డో పెద్ద కుమారుడు జూనియర్ రొనాల్డో 16వ వసంతంలోకి అడుగుపెట్టా.. జార్జినా గొప్పగా అతడి బర్త్‌డే సెలబ్రేట్ చేసింది.చదవండి: రొనాల్డో పెళ్లి వెనుక షాకింగ్ ట్విస్టు View this post on Instagram A post shared by Georgina Rodríguez (@georginagio) -
రొనాల్డో, జార్జినా వివాహం వెనుక షాకింగ్ ట్విస్ట్!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆగస్టు 11న తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకలా జరిగింది. అయితే రొనాల్డో, జార్జినా వివాహం వెనుక దాగున్న ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ధిక నిబంధనలు, షరతులతో రొనాల్డో, జార్జినా వివాహం జరగడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. వివాహ ధృవీకరణ పత్రంలోని వివరాల ప్రకారం, రొనాల్డో, జార్జినాలు 'ఆస్తి విభజన' చట్రం కింద వివాహం చేసుకున్నారు. ఈ లెక్కన వీరిద్దరు తమ వ్యక్తిగత ఆస్తులపై ఎవరికి వారే పూర్తి నియంత్రణ కలిగి ఉంటారని పోర్చుగీసు చట్టం చెబుతోంది.పోర్చుగీసు చట్టం ప్రకారం..పోర్చుగీస్ చట్టం ప్రకారం ఇలాంటి ఏర్పాటు వల్ల వివాహానికి ముందు, లేదా వివాహ సమయంలో ఇరుపక్షాల్లో ఎవరైనా సంపాదించిన ఆస్తులు, సంపాదనపై వారికే పూర్తి హక్కులు ఉండేలా రూపొందించడం జరుగుతుంది. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకున్న దంపతులు విడాకులు తీసుకున్నప్పటికీ ఆస్తుల విభజనలో హక్కు మాత్రం ఇద్దరికి సమానంగా ఉంటుంది. ఉదాహరణకు ఒప్పందం ప్రకారం రొనాల్డో తన ఆదాయ వనరుల్లో కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్లు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే ఆదాయంతో పాటు తాను ఆడుతున్న ఫుట్‌బాల్ క్లబ్ సహా సీఆర్7 హోటల్ చైన్‌లో అతడికి వచ్చే మొత్తం సంపాదన మొత్తంగా అతడికే చెందుతాయి తప్ప జీవిత భాగస్వామి జార్జినాకు పొందే అవకాశం ఉండదు.విడిపోతే నెలకు రూ. కోటి చెల్లింపుఅయితే ఒకవేళ భవిష్యత్తులో రొనాల్డో, జార్జినా విడిపోతే పోర్చుగీసు చట్టంలోని మొదటి నిబంధన ప్రకారం జార్జినాకు రొనాల్డో నుంచి 100,000 యూరో మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.10 కోట్లు) ఫించన్ రూపంలో అందుకుంటుంది. మరో నిబంధన ప్రకారం మాడ్రిడ్‌లోని లా ఫింకాలోని రొనాల్డోకు చెందిన విలాసవంతమైన భవనంపై మాత్రం జార్జినా పూర్తి యాజమాన్య హక్కు కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ భవనం ఆస్తి విలువ 5.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 53.50 కోట్లు)గా ఉంది. ఇక రొనాల్డో, జార్జినా వివాహం వారి ఐదుగురు పిల్లలు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సీక్రెట్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి వివాహానికి రొనాల్డో సహచర ఆటగాళ్లు కానీ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నస్ర్ క్లబ్ సహచరులు కానీ, సెలబ్రెటీలు ఎవరూ హాజరుల కాలేదు. మరో విషయమేంటంటే, వీరి పెళ్లి జరిగినప్పటికీ, ఈ ఇద్దరు తమ ఇంటిపేర్లను మార్చుకోకూడదని నిర్ణయించుకున్నారు.Read: తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లతో.. సర్ఫరాజ్‌కు చాన్స్!


