PC: Georgina Instagram
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం, క్రిస్టియానో రొనాల్డో ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లుగా సహజీవనం చేస్తున్న జార్జినా రోడ్రిగ్స్‌తో అధికారికంగా వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తాము తొలిసారి కలిసిన రోజు గుర్తుగా ఆగష్టు 11న పిల్లల సమక్షంలో తమ విలాసవంతమైన ఇంట్లోనే 41 ఏళ్ల రొనాల్డో- 32 ఏళ్ల జార్జినా పెళ్లి ప్రమాణాలు చేశారు.
ముగ్గురు పిల్లల తండ్రి
కాగా జార్జినాతో పరిచయం కంటే ముందే.. రొనాల్డో తండ్రైన సంగతి తెలిసిందే. 2010లో తన తొలి సంతానం జూనియర్ రొనాల్డోను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించిన ఈ పోర్చుగల్ దిగ్గజం.. అతడి తల్లి వివరాలు మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉంచాడు. జూనియర్ తర్వాత సరోగసి ద్వారా 2017లో రొనాల్డో మరో ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. వారి పేర్లు ఇవా మారియా, మేటియో. వీరిద్దరు కవలలు.
మొత్తం ఆరుగురు.. ఒకరు ఈ లోకంలో లేరు
ఇక 2016లో జార్జినాను తొలిసారి కలిసిన రొనాల్డో స్వల్ప కాలంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. సహజీవనం చేసే క్రమంలో వీరికి తొలుత కుమార్తె అలనా మార్టినా జన్మించింది. ఇక 2022లో ఈ జంటకు కవల పిల్లలు కుమార్తె బెల్లా ఎస్మెరల్డా, కుమారుడు ఏంజెల్ జన్మించారు.
కన్నతల్లిలా
కానీ దురదృష్టవశాత్తూ ఏంజెల్ పుట్టిన కాసేపటికే మరణించాడు. అయితే, రొనాల్డో జీవితంలోకి వచ్చిన నాటి నుంచే జార్జినా అతడి పిల్లలకు తల్లైపోయింది. జూనియర్ రొనాల్డో, ఇవా, మేటియోలను కన్నతల్లిలా వారి ఆలనాపాలనా చూసుకుంటోంది.

ముఖ్యంగా ఫుట్‌బాలర్‌గా జూనియర్ ప్రతీ ఈవెంట్లోనూ జార్జినా పాల్గొంటుంది. అతడిని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ.. ‘నా కుమారుడు ఇలాగే ఉంటాడు’ అంటూ అతడి చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేస్తుంది. తన సొంతపిల్లలతో పాటు రొనాల్డోకు తొలుత జన్మించిన ముగ్గురి పిల్లల పట్ల ఆమె ప్రేమగానే ఉంటుంది.
పిల్లల దత్తత
ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత జార్జినా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ రొనాల్డో, ఇవా, మేటియోలను ఆమె దత్తత తీసుకున్నట్లు పోర్చుగీస్ మీడియా వెల్లడించింది. ఈ ముగ్గురికి చట్టబద్ధంగా తల్లయ్యేందుకు జార్జినా ఈ మేరకు తన ఆలోచనను రొనాల్డోతో పంచుకోగా.. అతడు ఇందుకు సమ్మతించినట్లు సమాచారం. అయితే, దత్తత విషయాన్ని రొనాల్డో దంపతులు రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

బిడ్డల్ని కంటూనే ఉంటాం!
ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత ‘వోగ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జార్జినా- రొనాల్డోకు భవిష్యత్తులో మరింత మంది పిల్లల్ని కంటారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు రొనాల్డో బదులిస్తూ.. ‘పిల్లల్ని కనేందుకు నేను ఎప్పుడూ నో చెప్పను’ అని నవ్వేశాడు.
ఇక జార్జినా స్పందిస్తూ.. ‘ఇప్పటికే మా ఇల్లు పిల్లలతో నిండిపోయింది. అయితే, మా చిన్నారి పిల్లాడు 16వ వసంతంలోకి అడుగుపెట్టేశాడు. నిజానికి ఇంట్లో చిన్న పిల్లలు లేకుంటే నాకేమీ తోచదు. కాబట్టి పిల్లల్ని కనము అని మాత్రం చెప్పలేము’ అని జార్జినా నవ్వులు చిందించింది. కాగా రొనాల్డో పెద్ద కుమారుడు జూనియర్ రొనాల్డో 16వ వసంతంలోకి అడుగుపెట్టా.. జార్జినా గొప్పగా అతడి బర్త్‌డే సెలబ్రేట్ చేసింది.
చదవండి: రొనాల్డో పెళ్లి వెనుక షాకింగ్ ట్విస్టు


