మానవ్ సుతార్ రూపంలో టీమిండియాకు అద్భుతమైన స్పిన్నర్ దొరికాడు. తన అరంగేట్ర టెస్టులో అఫ్గానిస్తాన్‌పై అదరగొట్టిన సుతార్.. తాజాగా గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మానవ్ మొత్తంగా ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి భారత్‌కు కీలక విజయాన్ని అందించాడు.
ఈ నేపథ్యంలో సుతార్‌పై శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ రస్సెల్ ఆర్నాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నప్పటికీ అప్పుడే మానవ్‌ను 'స్పెషల్' బౌలర్‌గా ముద్ర వేయలేమని ఆర్నాల్డ్ అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ క్రికెట్‌లో గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తుండడంతో ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు మానవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టి తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన మానవ్.. 17 వికెట్లు పడగొట్టాడు.
"మానవ్‌కు అద్భుతమైన టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడి ఇప్పటివరకు ఆడింది కేవలం రెండు టెస్టులే. అవి కూడా స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పరిస్థితులే. కాబట్టి ఇప్పుడే అతడిని స్పెషలిస్ట్ స్పిన్నర్ అనడం కాస్త తొందరపాటే అవుతోంది. అతడు విదేశీ కండీషన్స్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది.
అతడు మంచి కంట్రోల్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ల మైండ్ సెట్‌ను ముందుగానే రీడ్ చేస్తున్నాడు. మంచి పిచ్‌లపై కూడా పరుగులను కట్టడి చేసే సత్తా అతడికి ఉంది. గతంలో విదేశీ పర్యటనల్లో అశ్విన్ కూడా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లపై ఒత్తిడి పెంచే వాడు. మానవ్ సుతార్ కూడా విదేశీ కండీషన్స్‌లో మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నా" అని సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుతార్ పేర్కొన్నాడు.


