గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. ముఖ్యంగా టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సుతార్ మొత్తంగా పది వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు.
మరో వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ఫర్వాలేదనిపించాడు. నాలుగు వికెట్లతో జడ్డూ రాణించినప్పటికి.. అతడి బౌలింగ్ శైలిపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జడేజా గతంలా ఇప్పుడు ఎటాకింగ్ స్పిన్నర్ కాదని, బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా మారిపోయాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
జడేజా, మానవ్ సుతార్‌కు బౌలింగ్‌లో ఎలాంటి పోలిక లేదు. ఇద్దరూ భిన్నమైన బౌలర్లు. చేతిలోనే బంతిని తిప్పడం సుతార్ బలం. స్టంప్స్ టార్గెట్‌గా బౌలింగ్ చేయడం జడ్డూ బలం. అతడు స్టాక్ బాల్స్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తాడు. అయితే జడేజా ఇప్పుడు అంత అటాకింగ్ స్పిన్నర్ కాదు.
అతడు బ్యాటర్‌గా ఉంటూ, బౌలింగ్‌లో సహాయపడే ప్లేయర్‌గా మారిపోయాడు. మరోవైపు మానవ్ తను ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ సత్తా చాటాడు. బ్యాటర్ల మైండ్ సెట్‌ను ముందుగానే అంచానా వేసి అతడు బౌలింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మానవ్ భారత స్పిన్ బౌలింగ్ విభాగంలో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
కాగా జడేజా గత కొంతకాలంగా టెస్టుల్లో బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికి బౌలింగ్‌లో మాత్రం అతడి గ్రాఫ్ పడిపోయింది. 2025 నుంచి జడేజా ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్‌లలో కేవలం 29 వికెట్లు పడగొట్టాడు. అతడు గతేడాది నుంచి కనీసం ఒక్కసారి ఫైవ్ వికెట్ హాల్ సాధించలేకపోయాడు. ఓవరాల్‌గా జడ్డూ తన టెస్టు కెరీర్‌లో జడేజా 169 మ్యాచ్‌లు ఆడి 352 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: పాకిస్తాన్ డ్రెసింగ్‌రూమ్‌కి వెళ్లు: నాసిర్ హుసేన్‌కు డీకే కౌంటర్


