డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం | Dewald Brevis Shines-South Africa Beat Zimbabwe-7 Wickets-Tri-Series | Sakshi
Sakshi News home page

డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం

Aug 29 2026 8:59 PM | Updated on Aug 29 2026 9:31 PM

Dewald Brevis Shines-South Africa Beat Zimbabwe-7 Wickets-Tri-Series

Photo Credit: Twitter

ప‌సికూన న‌మీబియా ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న సౌతాఫ్రికా టీ20 ట్రై సిరీస్‌లో బోణీ కొట్టింది. శ‌నివారం విండ్‌హోక్ వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. జింబాబ్వే విధించిన 145 ప‌రుగుల టార్గెట్‌ను స‌ఫారీలు 13.4 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. 

డెవాల్డ్ బ్రెవిస్ (32 బంతుల్లో 75 నాటౌట్‌, 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఓపెన‌ర్లు ప్రిటోరియ‌స్ (22), జోర్డాన్ హెర్మ‌న్ (20) ప‌ర్వాలేద‌నిపించారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో బ్రాడ్ ఎవ‌న్స్‌, బ్లెసింగ్ ముజ‌ర‌బానీ, నైమురి త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌క‌ముందు జింబాబ్వే 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది. 

ఓపెన‌ర్ బ్రియాన్ బెన్నెట్ (34) టాప్ స్కోర‌ర్ కాగా, మ‌రుమ‌నీ (13 బంతుల్లో 30, ఒక ఫోర్‌, మూడు సిక్స‌ర్లు) ఆఖ‌ర్లో మెరవ‌డంతో జింబాబ్వే గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును సాధించింది. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో డాన్ జాసెన్ 3 వికెట్లు తీయ‌గా, సుబ్ర‌యెన్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ విజ‌యంతో సౌతాఫ్రికా సిరీస్‌లో బోణీ కొట్ట‌గా, త‌ర్వాతి మ్యాచ్ సోమ‌వారం జింబాబ్వే, న‌మీబియా మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

Read: ఆసియా క్రీడ‌లకు ముందే బిగ్‌షాక్‌.. ప‌తకం పోయిన‌ట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement