బుమ్రా, పాండ్యా విష‌యంలో కీల‌క అప్‌డేట్! | Suspense Continues-Bumrah-Pandya-Playing Asian Games-AFG T20 Series | Sakshi
Sakshi News home page

బుమ్రా, పాండ్యా విష‌యంలో కీల‌క అప్‌డేట్!

Aug 29 2026 7:25 PM | Updated on Aug 29 2026 7:48 PM

Suspense Continues-Bumrah-Pandya-Playing Asian Games-AFG T20 Series

Photo Credit: Twitter

శ్రీలంక‌తో టెస్టు సిరీస్ ముగించుకున్న టీమిండియా స్వ‌దేశానికి చేరుకుంది. సెప్టెంబ‌ర్ 13 నుంచి 17 మ‌ధ్య అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. అయితే ఈ సిరీస్‌తో పాటు సెప్టెంబ‌ర్ 19న మొద‌లుకానున్న ఆసియా గేమ్స్‌లో టీమిండియా పురుషుల జ‌ట్టు మ్యాచ్‌లు సెప్టెంబ‌ర్ 24 నుంచి అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు  జ‌ర‌గ‌నున్నాయి. 

అయితే ఈ రెండు టోర్నీల‌కు భార‌త జ‌ట్టులో కీల‌క‌మైన స్పీడ‌స్ట‌ర్‌ బుమ్రా, ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఆడే విష‌య‌మై ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ (సీవోఈ)లోనే రీహాబిలిటేష‌న్‌లో గ‌డుపుతున్నారు. బుమ్రా ఎడ‌మ మోకాలి గాయంతో బాధ‌ప‌డుతుండగా, పాండ్యా వెన్నునొప్పి నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ, కాలి పిక్క కండ‌రాల గాయం తిర‌గ‌బెట్ట‌డంతో సీవోఈలోనే ఉండిపోయాడు.

తాజా నివేదిక‌ల ప్ర‌కారం ఈ ఇద్ద‌రి గాయాల‌పై కానీ, ఎప్పుడు కోలుకుంటార‌నే దానిపై కానీ ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. మ‌రోవైపు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు వీరిద్ద‌రు ఆడక‌పోవచ్చు. ఇక ఆసియా గేమ్స్‌కు కూడా టీమిండియా-బి జ‌ట్టును పంపే యోచ‌న‌లో ఉన్న‌ట్లు బీసీసీఐ ఇప్ప‌టికే పేర్కొంది. 

మ‌రి అప్ప‌టివ‌ర‌కు బుమ్రా, పాండ్యా కోలుకుంటే ఆసియా గేమ్స్‌లో ఆడుతారా అంటే అది కూడా అనుమాన‌మే. బి- జ‌ట్టును సిద్ధం చేస్తే మాత్రం బుమ్రా, పాండ్యాలు మ‌రికొంత కాలం రీహాబిలిటేష‌న్ కేంద్రంలోనే గ‌డ‌పాల్సి ఉంటుంది. మ‌రోవైపు గాయం నుంచి కోలుకున్న ప్రిన్స్ యాద‌వ్ ఆఫ్గ‌న్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం అందింది. ఇది భార‌త పేస్ బౌలింగ్ ద‌ళానికి గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు.

Read:  చెస్ ఆడాలని చాలెంజ్‌.. ‘సారీ బ్రో రిటైరయ్యా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement