PC: X
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. జింబాబ్వే పర్యటనలో గాయపడ్డ యువ ఫాస్ట్ బౌలర్, యార్కర్ల కింగ్ ప్రిన్స్ యాదవ్.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది.
ఆజ్ తక్ కథనం ప్రకారం.. ప్రిన్స్ యాదవ్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్‌నెస్ పరీక్షలను క్లియర్ చేసినట్లు సమాచారం. తద్వారా అఫ్గాన్‌తో సిరీస్ కోసం భారత జట్టు ఎంపికకు ప్రిన్స్ అందుబాటులో ఉండనున్నాడు. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ప్రిన్స్‌కు ఏమైందంటే?
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బౌలింగ్ చేస్తుండగా ప్రిన్స్ యాదవ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో 2.2 ఓవర్లు బౌలింగ్ చేసి ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మూడో టీ20కు అతడు దూరమయ్యాడు. అనంతరం ఈ ఢిల్లీ పేసర్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లో చేరి తన ఫిట్‌నెస్‌ను తిరిగి పొందాడు.
కాగా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో భారత సీనియర్ జట్టు సెలక్టర్ల నుంచి అతడికి పిలుపువచ్చింది. తనకు లభించిన అవకాశాన్ని ప్రిన్స్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
ఇప్పటివరకు భారత తరపున 3 వన్డేలు, 6 టీ20లు ఆడిన ప్రిన్స్ యాదవ్.. మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు.ఇప్పుడు ఈ రైట్ ఆర్మ్ పేసర్ అఫ్గానిస్తాన్‌పై సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు.
చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యుద్భుతం.. 1932 తర్వాత


