‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. బలమైన ఆధారాలున్నాయి’ | Anaya Bangar Strong-Reply-Marizanne-Kapp-Over-Unfair Advantage | Sakshi
Sakshi News home page

Anaya Bangar: ‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. బలమైన ఆధారాలున్నాయి’

Aug 29 2026 3:00 PM | Updated on Aug 29 2026 3:25 PM

Anaya Bangar Strong-Reply-Marizanne-Kapp-Over-Unfair Advantage

Photo Credit: Twitter

భార‌త మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ బంగ‌ర్ కూతురు అన‌యా బంగర్ (ట్రాన్స్‌జెండ‌ర్‌) క్రికెట్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున ఎలైట్ క్రికెట్‌లో ఆడేందుకు అనుమ‌తి పొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. అయితే సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండ‌ర్ మారిజ‌నే కాప్ మాత్రం అన‌యా బంగ‌ర్ మ‌హిళ‌ల క్రికెట్‌లో ఆడ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. 

ఒక ట్రాన్స్‌జెండ‌ర్‌కు మ‌హిళ‌ల క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా అనుమ‌తిస్తుంద‌ని ప్ర‌శ్నించిన ఆమె.. "ఇది పూర్తిగా హాస్యాస్ప‌దం.. అనుమ‌తించ‌డానికి వీల్లేదు" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. తాజాగా కాప్ విమ‌ర్శ‌ల‌పై అన‌యా బంగ‌ర్ స్పందించింది. 

"ఆమె (మరిజాన్ కాప్) వాదనలో ఉన్న బాధ నాకు అర్థమైంది. మాంచెస్టర్ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ నాకు పరీక్షలు నిర్వహించింది. ఒక సంవత్సరం పాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్న తర్వాతే, నా శరీరం అథ్లెటిక్ సామర్థ్యాలకు సంబంధించి వాళ్లు నాకు 12 వారాల పాటు టెస్టింగ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. సిస్‌జెండ‌ర్ ఫీమేల్ అథ్లెట్ రేంజ్ ప‌రిధికి లోబడే నా ఫిజిక‌ల్ పారామీట‌ర్స్ ఉన్నాయి. 

నేను ప్రొఫెషనల్ మహిళల క్రికెట్‌లోకి అడుగుపెట్టడం వల్ల ఎవరికీ ఎలాంటి అన్యాయమైన ప్రయోజనం ఉండదు. అందుకు నా వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మహిళల క్రీడల్లో సమ్మిళితత్వం, నిష్పక్షపాతం, గౌరవాన్ని కాపాడటంపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన విధానాలను రూపొందించింది. నేను ఇప్పటికే ఆ మార్గదర్శకాలను పాటిస్తున్నాను. అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.

శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి నా శరీరం టెస్టోస్టెరాన్‌ను ఉత్పత్తి చేయడం లేదు. నా టెస్టోస్టెరాన్ స్థాయి 0.6 నానోమోల్స్‌గా ఉన్నాయి. ఎవ‌రినీ మోసం చేయాల‌న్న ఉద్దేశం నాకు లేదు. ఇక‌ క్రికెట్ ఆస్ట్రేలియా నాకు అనుమతి ఇచ్చిందన్న వార్త వినడం, ప్రాథమికంగా మహిళల క్రికెట్ ఆడేందుకు నాకు ఒక మార్గాన్ని చూపించడం చాలా గొప్ప విషయం.’’ అని చెప్పుకొచ్చింది.

చదవండి: ఎలా అనుమ‌తిస్తారు? సంజ‌య్ బంగ‌ర్ కుమార్తెపై విమ‌ర్శ‌లు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement