క్రికెట్ చరిత్రలోనే అత్యుద్భుతం.. 1932 తర్వాత | Isle of Man spinner Joanne Hicks becomes oldest bowler to claim international five-wicket haul | Sakshi
Sakshi News home page

క్రికెట్ చరిత్రలోనే అత్యుద్భుతం.. 1932 తర్వాత

Aug 29 2026 1:45 PM | Updated on Aug 29 2026 1:56 PM

Isle of Man spinner Joanne Hicks becomes oldest bowler to claim international five-wicket haul

ఐల్ ఆఫ్ మ్యాన్ మహిళల క్రికెట్ జట్టు ఆఫ్-స్పిన్నర్ జోవాన్ హిక్స్ 51 ఏళ్ల వ‌య‌స్సులో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ సాధించిన అత్యంత వృద్ధ క్రికెటర్‌గా హిక్స్ నిలిచింది. ఉమెన్స్ కాంటినెంటల్ టీ20 కప్‌లో భాగంగా రొమేనియా వేదికగా గ్రీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ సాధించింది. 

హిక్స్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. తద్వారా హిక్స్ ఈ ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బెర్ట్ ఐరన్‌మాంగర్(49 ఏళ్ల 314 రోజులు) పేరిట ఉండేది. ఐరన్‌మాంగర్ 1932లో సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించింది. 

తాజా మ్యాచ్‌లో 51 ఏళ్ల 173 రోజుల వయస్సులో 5 వికెట్లు హాల్ సాధించిన హిక్స్‌..  92 ఏళ్ల ఐరన్‌మాంగర్ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. గ్రీస్ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు ఘన విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన గ్రీస్‌ 15 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. గ్రీస్‌ బ్యాటర్లలో అగెలికి(17) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం ఐల్ ఆఫ్ మ్యాన్ 6 ఓవర్లలో కేవలం ఇక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
చదవండి: TNPL 2026: పుట్టిన రోజు నాడు విధ్వంసం.. 7 ఫోర్లు, 5 సిక్సర్లతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement