ఆస్ట్రేలియా క్రికెట్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర | Spain Breaks Australia World Record In International Cricket | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా క్రికెట్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర

Aug 15 2026 1:46 PM | Updated on Aug 15 2026 1:59 PM

Spain Breaks Australia World Record In International Cricket

PC: Spain Cricket/X

అంతర్జాతీయ క్రికెట్‌లో స్పెయిన్‌ పురుషుల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూ.. దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. తద్వారా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ చరిత్రలో తమ పేరును చిరస్మరణీయం చేసుకుంది.

విషయం ఏమిటంటే.. ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ 2028 సబ్‌ రీజియనల్‌ యూరోప్‌ క్వాలిఫయర్‌- ‘సి’లో భాగంగా.. స్పెయిన్‌ తాజాగా ఫిన్‌లాండ్‌తో తలపడింది. కెరవా వేదికగా టాస్‌ గెలిచిన స్పెయిన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

అరవింద్‌ మోహన్‌ అర్ధ శతకం
ఈ క్రమంలో సొంతగడ్డపై మొదట బ్యాటింగ్‌కు దిగిన ఫిన్‌లాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ అరవింద్‌ మోహన్‌ అర్ధ శతకం (57) కారణంగా ఫిన్‌లాండ్‌కు ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. స్పెయిన్‌ బౌలర్లలో చార్లీ రుమిస్ట్రెమిజ్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. లోర్నే బర్న్స్‌ రెండు, యాసిర్‌ అలీ, ఆతిఫ్‌ మహమూద్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

16.4 ఓవర్లలోనే..
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన స్పెయిన్‌ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 135 పరుగులు సాధించింది. తద్వారా ఫిన్‌లాండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. స్పెయిన్‌ ఓపెనర్లలో గుర్విందర్‌ బజ్వా (14) విఫలం కాగా.. మహ్మద్‌ ఇహ్సాన్‌ (25) ఫర్వాలేదనిపించాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన యాసిర్‌ అలీ 40, డేనియెల్‌ డాలే కాలే 49 పరుగులతో అజేయంగా నిలిచి.. స్పెయిన్‌ను విజయతీరాలకు చేర్చారు. కాగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో స్పెయిన్‌కు వరుసగా ఇది 21వ విజయం కావడం విశేషం.

వరుసగా అత్యధిక విజయాలు
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా స్పెయిన్‌ చరిత్రకెక్కింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టింది. కాగా రిక్కీ పాంటింగ్‌ సారథ్యంలో ఆసీస్‌ 2003లో వరుసగా 20 విజయాలు నమోదు చేసింది. కాగా స్పెయిన్‌ జట్టుకు ప్రస్తుతం క్రిస్టియన్‌ మునోజ్‌ మిల్స్‌ సారథిగా ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్లు
1. స్పెయిన్‌- 21 విజయాలు (ఫిబ్రవరి 2023- ఆగష్టు 2026)
2. ఆస్ట్రేలియా- 20 విజయాలు (జనవరి 2003- మే 2003)
3. ఉగాండా- 17 విజయాలు (అక్టోబరు2024- జూలై 2025)
4. ఆస్ట్రేలియా- 16 విజయాలు (నవంబరు 2000- ఫిబ్రవరి 2001)
5. ఆస్ట్రేలియా- 16 విజయాలు (అక్టోబరు 2006- జనవరి 2007).

చదవండి: జైస్వాల్‌ను రనౌట్‌ చేయనా?.. కెప్టెన్‌ రియాక్షన్‌ ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement