AUS vs BAN: నా కెరీర్‌లో ఇలాంటిది చూడలేదు: గిల్‌క్రిస్ట్‌ | Never Seen: Head Act After Hasan Bowled Him Leaves Gilchrist Stunned | Sakshi
Sakshi News home page

AUS vs BAN: హెడ్‌ ఏం చేశావు?.. నా కెరీర్‌లో ఇలాంటిది చూడలేదు: గిల్‌క్రిస్ట్‌

Aug 15 2026 1:30 PM | Updated on Aug 15 2026 1:52 PM

Never Seen: Head Act After Hasan Bowled Him Leaves Gilchrist Stunned

PC: Cricket Australia X

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ పేసర్‌ హసన్‌ మహమూద్‌ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. డార్విన్‌ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి కంగారూ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ జోరు కొనసాగిస్తూ ఓపెనర్ల వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.

మరోసారి ఓపెనర్ల పని పట్టిన హసన్‌
హసన్‌ మహమూద్‌ బౌలింగ్‌లో తొలుత జేక్‌ వెదర్లాండ్‌ డకౌట్‌ కాగా.. ట్రవిస్‌ హెడ్‌ 35 బంతుల్లో 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. వీళ్లిద్దరిని అద్భుతమైన డెలివరీలతో మహమూద్‌ బౌల్డ్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ వెదర్లాండ్‌ (23), ట్రవిస్‌ హెడ్‌ (22) హసన్‌ మహమూద్‌ బౌలింగ్‌నే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

అదే తీరుగా మరోసారి బౌల్డ్‌
అయితే, యాధృచ్చికంగా తొలి ఇన్నింగ్స్‌లో ఎలాగైతే హెడ్‌ బౌల్డ్‌ అయ్యాడో.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే రీతిలో వికెట్‌ పారేసుకున్నాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్లో మహమూద్‌ బంతితో రంగంలోకి దిగాడు. రెండో బంతిని మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో మహమూద్‌ వేయగా.. స్క్వేర్‌ కట్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన హెడ్‌ బౌల్డ్‌ అయ్యాడు.

నా కెరీర్‌లో ఇలాంటిది చూడలేదు
అయినప్పటికీ ఎంతో సంయమనంగా హెడ్‌.. బెయిల్స్‌ను తీసి స్టంప్స్‌ మీద సర్ది నెమ్మదిగా క్రీజును వదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ క్రమంలో కామెంటెరీ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్‌.. ‘నా క్రికెటింగ్‌ కెరీర్‌లో ఇంత వరకు ఇలాంటిది చూడలేదు’ అని హెడ్‌ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెండుసార్లు ఒకే బౌలర్‌ బౌలింగ్‌లో.. ఒకే విధంగా అవుటైనప్పటికీ.. ప్రశాంతంగా ఉండటం అతడికే చెల్లించిందని చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్‌ ఆధిపత్యం
కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌- బంగ్లాదేశ్‌ మధ్య గురువారం మరారా స్టేడియంలో తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్‌ 426 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

ఫలితంగా బంగ్లా 228 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 42 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బంగ్లా కంటే ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: జైస్వాల్‌ను రనౌట్‌ చేయనా? ఇందులో తప్పేముంది?.. కానివ్వు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement