భారత్‌తో టీ20 సిరీస్‌.. అఫ్గానిస్తాన్‌ జట్టు ప్రకటన | Afghanistans T20 Squad vs India Announced; Kohli's Nemesis Included | Sakshi
Sakshi News home page

IND vs AFG: భారత్‌తో టీ20 సిరీస్‌.. అఫ్గాన్‌ జట్టు ప్రకటన! రెండేళ్ల తర్వాత అతడికి పిలుపు

Aug 24 2026 5:52 PM | Updated on Aug 24 2026 5:55 PM

Afghanistans T20 Squad vs India Announced; Kohli's Nemesis Included

భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు యువ బ్యాట‌ర్ ఇబ్రహీం జద్రాన్ నాయకత్వం వహించనున్నాడు. అదేవిధంగా ఫాస్ట్ బౌల‌ర్ న‌వీన్ ఉల్‌-హక్‌కు అఫ్గాన్ సెల‌క్ట‌ర్లు తిరిగి పిలుపునిచ్చారు.

ఈ రైట్ ఆర్మ్ పేస‌ర్ దాదాపు రెండేళ్ల త‌ర్వాత అఫ్గాన్ జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌-2024లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన న‌వీన్‌.. ఆర్సీబీ సూప‌ర్ స్టార్ విరాట్ కోహ్లితో గొడ‌వ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో కొన్నాళ్ల పాటు ఈ అఫ్గాన్ పేస‌ర్ మారు మ్రోగిపోయింది.

ఆ త‌ర్వాత న‌వీన్ గాయం కార‌ణంగా న‌వీన్ జాతీయ జ‌ట్టులో చోటు కోల్పోయాడు. తర్వాత ఫిట్‌నెస్ సాధించిన‌ప్ప‌టికి సెల‌క్ట‌ర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. మ‌ళ్లీ ఇప్పుడు ఎట్ట‌కేల‌కు తిరిగి జ‌ట్టులో చోటు క‌ల్పించారు. ఇక ఈ జ‌ట్టులో రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అతల్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్ వంటి ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఉన్నారు. 

ఈ ఏడాది జూన్‌లో భార‌త్-అఫ్గాన్ మ‌ధ్య టెస్టు, వ‌న్డే సిరీస్‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఏకైక టెస్ట్‌తో పాటు వ‌న్డే సిరీస్‌ను భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే జోరును క‌న‌బ‌రిచాల‌ని టీమిండియా ప‌ట్టుద‌ల‌తో ఉంది. మొత్తం మూడు మ్యాచ్‌లు ఢిల్లీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ప్ప‌టికి.. ఈ సిరీస్ అఫ్గానిస్తాన్ హోమ్ సిరీస్‌గా పరిగణించబడుతుంది. సెప్టెంబ‌ర్ 13 నుంచి ఈ మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.

భార‌త్‌తో టీ20 సిరీస్‌కు అఫ్గాన్ జ‌ట్టు
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), నూర్ రెహమాన్ , సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ఎఫ్ ముజీబ్ ఉర్ రహ్మద్, ఎఫ్. నవీన్-ఉల్-హక్.
చదవండి: IND vs SL: ధ్రువ్‌ జురెల్‌ సెంచరీ.. దెబ్బకు ధోని ఆల్‌టైమ్‌ రికార్డ్‌ బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement