ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పురానీ ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్-2లో 72 పరుగుల తేడాతో గెలుపొంది సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తమ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
కెప్టెన్ వీరవిహారం
ఈ మ్యాచ్‌లో సెంట్రల్ కింగ్స్ కెప్టెన్ జాంటీ సిద్ధూ విధ్వంసం సృష్టించాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సిద్దూ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 46 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సిద్దూ.. 10 సిక్స్‌లు, 5 ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆదిత్య భండారి(24), సమర్థ్ సింగ్(25) రాణించారు.
అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పురానీ ఢిల్లీ 17.4 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. పురానీ ఓపెనర్ సమర్థ్ సింగ్(45), ధనంజయ్ సింగ్(34) టాప్ స్కోరర్లగా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ సిద్దూ మూడు వికెట్లు పడగొట్టగా.. తేజస్, గావ్నిష్, మానీ తలా రెండు వికెట్లు సాధించారు.
సిద్దూ ఐపీఎల్‌లోకి వస్తాడా?
కాగా ఇప్పటికే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ నుంచి ప్రిన్స్ యాదవ్, ప్రియాన్ష్ ఆర్య వంటి యువ ఆటగాళ్లు ఐపీఎల్‌లోకి వచ్చి సత్తాచాటుతున్నారు. ప్రిన్స్ యాదవ్ అయితే భారత సీనియర్ జట్టులోకి వచ్చేశాడు. ఇప్పుడు ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్న జాంటీ సిద్దూ కూడా భారత క్రికెట్‌వైపు అడుగులు వేస్తున్నాడని క్రికెట్ విశ్లేషుకులు అభిప్రాయపడతున్నారు.
ఈ ఏడాది డీపీఎల్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు 352 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్-2027 వేలంలో అతడిపై కాసుల వర్షం కురువడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.
చదవండి: IND vs AFG: టీమిండియాకు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు!


