అన్‌మోల్ సిక్సర్ల వర్షం..సెమీస్‌కు సౌత్ ఢిల్లీ | Delhi Premier League 2026: South Delhi Superstarz beat New Delhi Tigers | Sakshi
Sakshi News home page

అన్‌మోల్ సిక్సర్ల వర్షం..సెమీస్‌కు సౌత్ ఢిల్లీ

Aug 25 2026 2:45 PM | Updated on Aug 25 2026 2:52 PM

Delhi Premier League 2026: South Delhi Superstarz beat New Delhi Tigers

Photo Credit: Twitter

ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్ 2026 సీజ‌న్‌లో సౌత్‌ఢిల్లీ సూప‌ర్‌స్టార్స్ 5 వికెట్ల తేడాతో న్యూఢిల్లీ టైగ‌ర్స్‌పై విజ‌యాన్ని అందుకుంది. బౌలింగ్‌లో దివాన్ష్ రావ‌త్ 4 వికెట్లు తీయ‌గా, ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లో అన్మోల్ శ‌ర్మ (57) అర్ధ‌సెంచ‌రీతో సౌత్ ఢిల్లీ సునాయ‌స విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ ఢిల్లీ టైగ‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగులు చేసింది. 

ల‌క్ష్య త‌రేజా (62) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా, కెప్టెన్ హిమ్మ‌త్ సింగ్ (24) ప‌ర్వాలేదనిపించాడు. చివ‌ర్లో పార్థ్ బాలి (22) మెరిశాడు. సౌత్ ఢిల్లీ బౌల‌ర్ల‌లో దివాన్ష్ రావ‌త్ 4 వికెట్లు తీయగా, అంకిత్ ద‌బాస్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం సౌత్‌ఢిల్లీ సూప‌ర్‌స్టార్స్ 18.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. 

అన్మోల్ శ‌ర్మ (57) ఫిఫ్టీ చేయ‌గా, చివ‌ర్లో ఎకాన్ష్ దోబ‌ల్ (18 బంతుల్లో 38 నాటౌట్‌) అజేయంగా నిలిచి జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చాడు.  నార్త్ ఢిల్లీ బౌల‌ర్ల‌లో పార్ధ్ బాలి 3 వికెట్లు తీయ‌గా, మ‌నీష్ షెరావ‌త్‌, య‌ష్‌జీత్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement