ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచిన ఇషాన్‌, వైభవ్‌ జట్టు | Duleep Trophy 2026 1st Quarter final: East Zone beat North East Zone and enters semi finals | Sakshi
Sakshi News home page

ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచిన ఇషాన్‌, వైభవ్‌ జట్టు

Aug 25 2026 1:49 PM | Updated on Aug 25 2026 1:58 PM

Duleep Trophy 2026 1st Quarter final: East Zone beat North East Zone and enters semi finals

source: BCCI X

దులీప్‌ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్‌ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ (కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ (వైస్‌ కెప్టెన్‌) నేతృత్వంలోని ఈస్ట్‌ జోన్‌ జట్టు నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై ఇన్నింగ్స్‌ 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈస్ట్‌ జోన్‌.. సుదీప్‌ కుమార్‌ ఘరామీ (146), షాబాజ్‌ అహ్మద్‌ (167) సెంచరీలతో కదంతొక్కడంతో 467 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ జట్టు.. అభిజిత్‌ సర్కార్‌ (5-20), షాబాజ్‌ అహ్మద్‌ (3-20) ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది.

ఆతర్వాత ఫాలో ఆన్‌లోనే ఏమాత్రం ప్రతిఘటించలేకపోయిన నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ 146 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయంపాలైంది. అనుకూల్‌ రాయ్‌ (5-37) రెండో ఇన్నింగ్స్‌లో నార్త్‌ ఈస్ట్‌ జట్టును దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ రెండో ఇన్నింగ్స్‌లో బంతితో సత్తా చాటి 2 వికెట్లు (4 బంతుల వ్యవధిలో) తీశాడు. 

చదవండి: బౌలర్‌గానూ ఇరగదీసిన వైభవ్‌ సూర్యవంశీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement