షాబాజ్, ఘరామీ (PC: CAB X)
దులిప్ ట్రోఫీ- 2026 క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి, బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ భారీ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రతిష్టాత్మక దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆదివారం మొదలయ్యాయి.
ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్- నార్త్ ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి.
వైభవ్ సూర్యవంశీ విఫలం
ఓపెనర్లలో సీనియర్ అభిమన్యు ఈశ్వరన్ (15), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (8) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ కుశాగ్రా (55).. నాలుగో నంబర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
ఘరామీ, షాబాజ్ సెంచరీలు
ఈ క్రమంలో ఘరామీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 185 బంతులు ఎదుర్కొన్న అతడు.. 25 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 146 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో విరాట్ సింగ్ (2), కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (4) నిరాశపరిచారు.
ఇలాంటి తరుణంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ అనూహ్య రీతిలో నిలకడైన ఆటతో సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 244 బంతులు ఎదుర్కొన్న షాబాజ్.. 167 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. ఇక మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (37) ఓ మోస్తరుగా రాణించగా.. మహ్మద్ షమీ 11, ముకేశ్ 7, అభిజిత్ సర్కార్ 9 (నాటౌట్) పరుగులు చేశారు.
A masterclass in grit and determination! 🏏
Shahbaz Ahmed brings up a magnificent 150 (211) for East Zone in the Duleep Trophy 2026-27, anchoring the innings with pure class. 🌟#DuleepTrophy #EastZone #ShahbazAhmed #CAB pic.twitter.com/RChs72osxT— CABCricket (@CabCricket) August 24, 2026
స్కోరెంతంటే?
ఫలితంగా ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 112.5 ఓవర్లు ఆడి 467 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఘరామీ- షాబాజ్ అత్యధికంగా ఆరో వికెట్‌కు 150 పరుగులు జోడించారు. మరోవైపు.. అనుకుల్ రాయ్‌తో కలిసిషాబాజ్ ఏడో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇక నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో ఆకాశ్ చౌదరి, ఫిరోయిజామ్ జోటిన్ మూడేసి వికెట్లు తీయగా.. బిశ్వోర్జిత్ కొంతుజమ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ రంగ్‌సేన్ జొనాథన్, టెచి నెరి తలా ఒక వికెట్ పడగొట్టారు.
చదవండి: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్


