ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో మీరట్ ఘన విజయం సాధించింది. మీరట్‌కు ఇది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం.
కాగా ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన గోరఖ్‌పూర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. గోరఖ్‌పూర్ బ్యాటర్లలో అభయ్ ప్రతాప్ సింగ్(33) టాప్ స్కోరర్‌గా నిలిచారు. మీరట్ బౌలర్లలో జీషన్ అన్సారీ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
అనంతరం ఈ లక్ష్యాన్ని మీరట్ మావెరిక్స్ వికెట్ కోల్పోకుండా 6.4 ఓవర్లలో ఊదిపడేసింది. అయితే లక్ష్య చేధనలో మీరట్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ అక్షయ్ దూబే(9) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మీరట్ మావెరిక్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ రింకూ సింగ్ మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అందరిని ఆశ్చర్చపరిచాడు.
అక్షయ్ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏకనా మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం ఏడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్.. 2 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 29 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అతడి స్ట్రైక్ రేట్ 414.29గా ఉండడం గమనార్హం. రింకూతో పాటు యువ ఆటగాడు స్వస్తిక్ చికారా(24 బంతుల్లో 44) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: మీకేం తెలుసు?: హర్షా భోగ్లేకు ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్


