కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి రోజు ఆటలో మణికట్టు గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించి రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చాడు.
రెండో రోజు ఆటలో కూడా శ్రీలంక బౌలర్లు పంత్‌ను టార్గెట్ చేస్తూ షార్ట్ పిచ్ బంతులను సంధించారు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన పంత్.. క్రీజులో నిలదొక్కున్నాక లంక బౌలర్లను ఉతికారేశాడు. లహిరు కుమార బౌలింగ్‌లో పంత్ కొట్టిన భారీ సిక్సర్ తన ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్‌గా నిలిచే అవకాశముంది.
భారత ఇన్నింగ్స్ 90వ ఓవర్‌లో కుమార.. ఐదో బంతిని పంత్‌కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఈసారి మాత్రం పంత్ సరైన సమాధనమిచ్చాడు. ఆ డెలివరీని పంత్ 'ఫైన్ లెగ్' మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. పంత్ దెబ్బకు బంతి స్టేడియం బయటకు వెళ్లిపడింది. దీంతో అంపైర్ కొత్త బంతిని తీసుకొచ్చాడు. కాగా మొదటి రోజు కుమార బౌలింగ్‌లోనే పంత్ గాయపడ్డాడు. ఇప్పుడు ఈ సిక్సర్‌తో పంత్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. పంత్ 63 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తోంది. సెకెండ్ డే లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్(59) ఉన్నాడు.
చదవండి: Kuldeep Yadav: ‘అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు’
— crictalk (@crictalk7) August 24, 2026


