source: IPL X
టీమిండియా ఫినిషర్‌గా పేరొందిన రింకూ సింగ్ ఛేజింగ్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. యూపీ టీ20 లీగ్ 2026లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. లక్నో ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
🚀Rocket Rinku for a reason. 🔥pic.twitter.com/Ktl4vMBkk8 https://t.co/ChVvyki6Ym
— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) August 19, 2026
183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జట్టు కష్టాల్లో (10 ఓవర్లలో 75-4) ఉన్నప్పుడు ఆరో స్థానంలో బరిలోకి దిగిన రింకూ.. కేవలం 24 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు.
రింకూ విధ్వంసంతో మావెరిక్స్ స్కోర్ 154/6కు చేరుకుంది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మావెరిక్స్‌ను 5 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.
2023 జ్ఞాపకాలు
రింకూ సింగ్ తాజా ఇన్నింగ్స్ చూసిన అభిమానులకు 2023 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై అడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుకొచ్చింది. ఆ మ్యాచ్ చివరి ఓవర్‌లో యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది 29 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రింకూ, అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.
ఫినిషర్‌గా రింకూ ఎందుకు ప్రత్యేకం..?
2023 ఐపీఎల్ తర్వాత రింకూ సింగ్‌కు నమ్మకమైన ఫినిషర్ అనే గుర్తింపు వచ్చింది. 2026 ఐపీఎల్‌లోనూ అతను 59.00 సగటుతో రాణించాడు. అయితే బ్యాటింగ్ స్థానాల్లో మార్పులు రావడంతో 2023 స్థాయి స్థిరత్వాన్ని మాత్రం కొనసాగించలేకపోయాడు.
అయినా ఒత్తిడిలో ఛేజింగ్‌ను ముగించే సామర్థ్యంలో రింకూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టీ20ల్లో ఛేజింగ్ చేసిన 54 మ్యాచ్‌ల్లో 34 విజయాల్లో అతను భాగమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 94 టీ20 మ్యాచ్‌ల్లో అతని సగటు 33.04, స్ట్రైక్‌రేట్ 139.44. ఈ క్రమంలో ఎనిమిది అర్ధసెంచరీలు సాధించాడు.


