రికార్డుల మోత మోగించిన సుతార్‌ | All Records Broken By Manav Suthar In IND vs SL 1st Test 2026 | Sakshi
Sakshi News home page

రికార్డుల మోత మోగించిన సుతార్‌

Aug 19 2026 2:57 PM | Updated on Aug 19 2026 3:02 PM

All Records Broken By Manav Suthar In IND vs SL 1st Test 2026

source: BCCI X

శ్రీలంకపై తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో (6/55) ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీయడంతో పాటు మ్యాచ్‌ మొత్తంలో 10 వికెట్లు (10/131) పడగొట్టిన అతడు, పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

సుతార్ బద్దలు కొట్టిన రికార్డులు
* 6/55: శ్రీలంక గడ్డపై శ్రీలంకపై భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్ గణాంకాల్లో రెండో స్థానం. రవిచంద్రన్ అశ్విన్ 6/46తో ముందున్నాడు.
* 10/131: శ్రీలంకలో ఒక టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు.
* శ్రీలంకపై టెస్టుల్లో భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ మ్యాచ్ గణాంకాల్లో నాలుగో స్థానం.
* సుతార్‌ తన కెరీర్‌లో 2 టెస్ట్‌లు పూర్తయ్యేసరికి 17 వికెట్లు తీసుకున్నాడు. ఈ జాబితాలో నరేంద్ర హిర్వాణి 24 వికెట్లతో, అక్షర్ పటేల్ 18 వికెట్లతో మాత్రమే సుతార్ కంటే ముందున్నారు.
* శ్రీలంకపై టెస్టుల్లో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.

రెండు టెస్టుల్లోనే 17 వికెట్లు
24 ఏళ్ల సుతార్ టెస్టు కెరీర్‌కు ఇది అద్భుతమైన ఆరంభం. ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్‌పై అరంగేట్రం చేసిన అతను తొలి టెస్టులోనే ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు.

ఇప్పుడు శ్రీలంకపై 10 వికెట్లతో తన సత్తా చాటాడు. దీంతో కేవలం రెండు టెస్టుల్లో 17 వికెట్లు సాధించాడు. అతని బౌలింగ్ సగటు 11.35గా ఉంది. ఇప్పటివరకు రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు, ఒక 10 వికెట్ల మ్యాచ్ ప్రదర్శన నమోదు చేశాడు.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పడిక్కల్‌కు
సుతార్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దేవదత్ పడిక్కల్‌కు దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 167 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 44 పరుగులు సాధించాడు. సాయి సుదర్శన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన పడిక్కల్ తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.

తాజా విజయంతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement