source: BCCI X
శ్రీలంకపై తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో తమ పరిస్థితిని మెరుగుపరుచుకుంది. తొలి టెస్టుకు ముందు భారత్ PCT 48.15%గా ఉండగా, శ్రీలంకపై విజయం తర్వాత అది 53.55%కి పెరిగింది. PCT శాతం పెరిగినప్పటికీ భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఇంకా గణనీయమైన తేడా ఉంది.
ఈ సైకిల్‌లో భారత్ ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో భారీగా విజయాలు సాధించాల్సి ఉంటుంది. భారత్ తదుపరి శ్రీలంకతో మరో టెస్టు, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 6 టెస్టులు గెలిస్తే భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలు బలపడతాయి. అది మాత్రమే సరిపోదు. పై స్థానాల్లో ఉన్న జట్లు కూడా పాయింట్లు కోల్పోవాలి. అప్పుడే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా 77.78 శాతం PCTతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (66.67) భారత్ కంటే ముందు (వరుసగా రెండు నుంచి నాలుగు) స్థానాల్లో ఉన్నాయి.
శ్రీలంక పరిస్థితి మరింత క్లిష్టం
భారత్ చేతిలో ఓటమితో శ్రీలంక WTC ఫైనల్ అవకాశాలు మరింత దెబ్బతిన్నాయి. శ్రీలంకకు ఇంకా 7 టెస్టులు మిగిలి ఉన్నాయి. భారత్‌తో మరో టెస్టుతో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్‌లలో విదేశీ సిరీస్‌లు, దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్ ఆడాల్సి ఉంది.
ప్రస్తుతం ఆ జట్టు 33.33 శాతం PCTతో భారత్ తర్వాత ఆరో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ (24.36), పాక్ (22.22), వెస్టిండీస్ (20.83) చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా, శ్రీలంకపై తొలి టెస్ట్ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 23న కొలొంబోలో ప్రారంభం కానుంది.


