భారత కబడ్డీ జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే? | India Announce Kabaddi Squads For Asian Games 2026 | Sakshi
Sakshi News home page

Asian Games 2026: భారత కబడ్డీ జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే?

Aug 24 2026 1:35 PM | Updated on Aug 24 2026 1:35 PM

India Announce Kabaddi Squads For Asian Games 2026

జ‌పాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఆసియా క్రీడ‌లు-2026 కోసం 12 మంది సభ్యులతో కూడిన భార‌త పురుష‌ల‌, మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టును ఏకేఎఫ్‌ఐ ప్రకటించింది. పురుషల జట్టు కెప్టెన్‌గా స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ వ్యవహరించనుండగా.. మహిళల జట్టుకు రీతు నేగి నాయకత్వం వహించనుంది. 

మెన్స్ జట్టులో ప్రో కబడ్డీ లీగ్ స్టార్ రైడర్లు అయన్ లోచ్‌హాబ్, దేవాంక్ దలాల్‌కు చోటు దక్కింది. వీరిద్దరూ పవన్ సెహ్రావత్ రైడింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు. అర్జున్ దేష్వాల్, అషు మాలిక్ కూడా రైడింగ్ విభాగంలో సపోర్ట్‌గా ఉండనున్నారు.

అదేవిధంగా సునీల్ కుమార్, సుమిత్ సాంగ్వాన్ డిఫెన్స్ విభాగాన్ని ముందండి నడిపించనున్నారు. 2023 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన  భారత కబడ్డీ జట్టు నుంచి ఈసారి కేవలం నలుగురు (అర్జున్ దేష్వాల్, సునీల్ కుమార్, పవన్ షెరావత్, అస్లాం ఇనామ్‌దార్) ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కడం గమనార్హం.

కాగా ఈ ఏడాది ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ఈ ఈవెంట్‌లో  కబడ్డీ పోటీలు సెప్టెంబర్ 21 నుండి 26 వరకు నాగోయా సిటీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సెంటర్‌లో జరగనున్నాయి.

భారత పురుషుల కబడ్డీ జట్టు:
అషు మాలిక్, అయన్ లోచ్‌హాబ్, దేవాంక్ దలాల్, అర్జున్ దేష్వాల్, సునీల్ కుమార్, జైదీప్ దహియా, రాహుల్ సేత్‌పాల్, గౌరవ్ ఖత్రి, సుమిత్ సాంగ్వాన్, అంకిత్ జగ్లాన్, పవన్ షెరావత్, అస్లాం ఇనామ్‌దార్.

భారత మహిళల కబడ్డీ జట్టు:
రీతూ నేగి, పుష్ప రాణా, సోనాలి షింగేట్, సంజు దేవి, పూజా కజ్లా, రీతూ షెరోన్, జ్యోతి ఠాకూర్, పింకీ రాయ్, మనీషా కుమారి, భవానా ఠాకూర్, రాజ్‌రాణి, నికితా కుమారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement