breaking news
Indian kabaddi team
-
PKL 12: తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ..
ప్రొ కబడ్డి లీగ్ ఫ్రాంఛైజీ తమిళ్ తలైవాస్ (Tamil Thalaivas) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కెప్టెన్, భారత కబడ్డీ జట్టు సారథి పవన్ సెహ్రావత్ (Pawan Sehrawat)ను టీమ్ నుంచి తొలగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.అందుకే ఈ నిర్ణయం‘‘క్రమశిక్షణా రాహిత్యం కారణంగా పవన్ సెహ్రావత్‌ను ఇంటికి పంపించివేశాము. ఈ సీజన్లో అతడు ఇక మా జట్టులో భాగంగా ఉండడు. జట్టుకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని తమిళ్ తలైవాస్ స్పష్టం చేసింది.ఒక వ్యక్తి కారణంగానే ఇలా..ఈ ఆరోపణలపై పవన్ సెహ్రావత్ తాజాగా స్పందించాడు. ‘‘ఫ్రాంఛైజీ పెట్టిన పోస్టు చూసి నాకు చాలా మంది ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. వారందరికీ ధన్యవాదాలు. తొమ్మిదో సీజన్లో కూడా నేను ఈ జట్టులోనే ఉన్నాను. గాయపడిన సమయంలో వారు నాకు అండగా నిలిచారు.మా తమ్ముడు అర్జున్‌తో కలిసి జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు నేను ఎన్నో ప్రణాళికలు రచించాను. అయితే ఒక వ్యక్తి కారణంగా మేము ఆ పని పూర్తిచేయలేకపోయాము’’ అని పవన్ సెహ్రావత్ తెలిపాడు.దోషినని తేలితే.. ఇక జన్మలో కబడ్డీ ఆడనుఅదే విధంగా.. ‘‘ఈ ఫ్రాంఛైజీ నా మీద క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాననే ఆరోపణలు చేస్తోంది. నేను భారత జట్టులో ఉన్నాను. క్రమశిక్షణ అంటే ఏమిటో నాకు తెలుసు. నిజంగా వారు ఆరోపించినట్లు నేను దోషినని తేలితే.. ఇక జన్మలో కబడ్డీ ఆడను’’ అంటూ పవన్ సెహ్రావత్ సవాలు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రూ. 59.5 లక్షల భారీ ధరకాగా గతేడాది వరకు పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్‌కు ఆడాడు. అయితే, ఈసారి వేలంలో రూ. 59.5 లక్షల భారీ ధరకు తమిళ్ తలైవాస్ పవన్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించింది. ఇక ఈ సీజన్లో తలైవాస్ ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో పవన్ భాగమయ్యాడు.అయితే, జైపూర్ లెగ్‌లో భాగంగా బెంగాల్ వారియర్స్‌తో ఆడాల్సిన మ్యాచ్‌కు పవన్ హాజరు కాలేదు. జట్టుతో కలిసి అతడు జైపూర్‌కు ప్రయాణం చేయలేదు. ఇక ఈ మ్యాచ్‌లో అర్జున్ దేశ్వాల్ తమిళ్ తలైవాస్ సారథిగా వ్యవహరించి జట్టుకు విజయం అందించాడు.రెండు గెలిచి..ఇదిలా ఉంటే.. ప్రొ కబడ్డి లీగ్ పన్నెండో సీజన్లో తమిళ్ తలైవాస్ మిశ్రమ ఫలితాలు చవిచూస్తోంది. ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, కెప్టెన్ పవన్ సెహ్రావత్ వంటి ఆల్‌రౌండర్‌ను వదులుకుని పెద్ద సాహసమే చేసింది. ఇక ఈ సీజన్లో పవన్ 22 రెయిడింగ్ పాయింట్లు సాధించగలిగాడు.చదవండి: పాక్‌తో మ్యాచ్ బహిష్కరించాలంటూ విజ్ఞప్తులు!.. ఆటగాళ్లకు గంభీర్ మెసేజ్ ఇదే.. Pawan Sehrawat gives clarification on undisciplinary allegation by Tamil Thalaivas 😲🎥 - Pawan Sehrawat/Insta#PKL | #PKL12 | #ProKabaddiLeague | #Kabaddi | #PKLSeason12 | #ProKabaddi | #PawanSehrawat | #TamilThalaivas pic.twitter.com/xrbrSeJEoJ— Khel Kabaddi (@KhelNowKabaddi) September 14, 2025 -
భారత మహిళల కబడ్డీ జట్టుకు రూ. 67.50 లక్షల నగదు బహుమతి
ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఐదోసారి విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ. 67.50 లక్షల నగదు బహుమతి అందించింది. ఇటీవల ఇరాన్ వేదికగా జరిగిన టోర్నీలో అజేయంగా నిలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు... ఫైనల్లో 32–25 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఇరాన్ జట్టును ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఐదో సారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.మంగళవారం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత మహిళల కబడ్డీ జట్టును కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ‘మహిళా అథ్లెట్లను మరింత ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. మహిళా కబడ్డీ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కబడ్డీ లీగ్‌ను కూడా ప్రారంభించాలనుకుంటున్నాం’ అని అన్నారు. -
వరుసగా ఎనిమిదో స్వర్ణం సాధిస్తాం: రాహుల్ చౌదరీ
సనత్‌నగర్: వరుసగా ఏడుసార్లు విజేత... ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు ఘనత. ఇదే ఆనవాయితీని కొనసాగించేందుకు అజయ్ ఠాకూర్ సేన సిద్ధమైంది. ఆగస్టులో ఇండోనేసియా వేదికగా జరుగనున్న ఈ క్రీడల్లో ఎనిమిదో స్వర్ణాన్ని సాధించడమే తమ లక్ష్యమంటున్నాడు భారత స్టార్ రైడర్ రాహుల్ చౌదరి. మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘రైడ్ ఫర్ గోల్డ్’ పేరిట జరుగుతోన్న ప్రచార కార్యక్రమంలో రాహుల్ చౌదరి పాల్గొన్నాడు. బేగంపేట్‌లోని గీతాంజలి స్కూల్ ప్రాంగణంలో పాఠశాల విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. చిన్నారులతో కబడ్డీ ఆడుతూ వారిని ప్రోత్సహించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయకరణ్, ప్రిన్సిపల్ మాయ సుకుమారన్, ఫిజికల్ ట్రైనర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో రాహుల్ చౌదరీ విద్యార్థుల ప్రశ్న: 1990లో తొలి స్వర్ణం సాధించి నప్పటికీ, ఇప్పటికీ జట్టులో తేడా ఏమైనా ఉందా? రాహుల్: మొదటిసారి పోటీలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఉంటారో? వారి బలాలు, బలహీనతలు ఏంటి? అనే అంశాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నాం. కానీ అప్పుడు ఇప్పుడూ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రోజూ ప్రాక్టీస్‌కు ఎంత సమయం కేటాయిస్తారు? ఉదయం 45 నిమిషాల వ్యాయామం, వాకింగ్‌తో సరిపెడితే కుదరదు. కోచ్ పర్యవేక్షణలో 6 గంటలు, స్వతహాగా టీమ్ సభ్యులందరం కలిసి మరో 6 గంటలు... మొత్తం 12 గంటలు ప్రాక్టీస్‌కే అంకితమవుతాం. ఫిట్నెస్ కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటారు? పిజ్జాలు, బర్గర్లకు చాలా దూరంగా ఉంటాం. సహజమైన పోషకాలు లభించే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాం. డ్రైప్రూట్స్, నట్స్ ఎక్కువగా తీసుకుంటాం. వరుసగా ఎనిమిదోసారి బంగారు పతకం సాధిస్తామని గట్టిగా ఎలా చెబుతున్నారు? ఏడేళ్లుగా వివిధ దేశాల జట్ల ఆటతీరును నిశితంగా పరిశీలించాం. వారి బలాలు, బలహీనతలు స్పష్టంగా అవగతమయ్యాయి. వీటితో పాటు యావత్ భారత జాతి కూడా మాకు మద్దతుగా ఉంది. కచ్చితంగా స్వర్ణం సాధిస్తామనే విశ్వాసం బలంగా ఉంది. -
భారత్ కూత అదిరింది
దుబాయ్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత కబడ్డీ జట్టు సెమీస్‌లో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. మాస్టర్స్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత పొందింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్ 36–20తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 10 రైడ్ పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెన్స్‌లో గిరీశ్ ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో జాంగ్ కున్ లీ ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ ఆరంభంలో గట్టి పోటీనిచ్చిన కొరియా ఆ తర్వాత భారత్ ముందు నిలువలేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 17–10తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా పట్టు కొనసాగిస్తూ విజయం సొంతం చేసుకుంది. మరో సెమీఫైనల్లో ఇరాన్ 40–21తో పాకిస్తాన్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది. శనివారం జరుగనున్న తుది పోరులో భారత్, ఇరాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేటి ఫైనల్: రాత్రి గం. 7.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ఇండియన్ కబడ్డీ కోచ్ గా శ్రీనివాస్ రెడ్డి
ఉత్తర్పల్లివాసికి అరుదైన గౌరవం ఇరాన్లో పాల్గొనే జట్టుకు శిక్షణ ఇచ్చే అవకాశం సాక్షి, సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇండియన్ కబడ్డీ టీం కోచ్‌గా ఎంపికయ్యా రు. ఇరాన్లో వచ్చేనెల జరగనున్న ఏషియన్ కబడ్డీ చాంపియన్ షిప్లో పాల్గొనే భారత కబడ్డీ జట్టుకు శ్రీనివాస్‌రెడ్డి కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈనెల 16 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని స్టోర్ప్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో ఏషియన్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే కబడ్డీ జట్టుకు కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నారు. కోచింగ్ క్యాంపుకు ఎంపికైన కబడ్డీ మహిళా, పురుష క్రీడాకారులకు ఎల్.శ్రీనివాస్‌రెడ్డి శిక్షణ ఇవ్వనున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కోచ్ హోదాలో వచ్చేనెల 13 నుంచి ఇరాన్లో జరిగే ఏషియన్కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలకు కబడ్డీ జట్టు వెంట వెళ్లనున్నారు. ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్‌లో పాల్గొంటున్న తెలుగు టైటాన్స్ జట్టుకు కోచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గతంలో దక్షిణా కొరియా జట్టుకు సైతం శ్రీనివాస్‌రెడ్డి కోచ్‌గా పనిచేశారు. సంగారెడ్డి మండలం ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కబడ్డీ క్రీడాకారునిగా కేరీర్ ప్రారంభించారు. జాతీయ భారత కబడ్డీ జట్టును దేశ, విదేశాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పలు పథకాలు సాధించారు. ప్రస్తుతం ఆంధ్రబ్యాంకు కబడ్డీ జట్టుకు కెప్టెన్ వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి గత కొంతకాలంగా కోచ్‌గా పనిచేస్తున్నారు. భారత జట్టుకు కోచ్‌గా ఎంపికకావటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏషియన్ కబడ్డీ చాంపియన్‌లో పాల్గొనే కబడ్డీ జట్టుకు శిక్షణ ఇవ్వటం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు.