ఇండియన్ కబడ్డీ కోచ్ గా శ్రీనివాస్ రెడ్డి | indian kabaddi new coach lingampalli srinivas reddy | Sakshi
Sakshi News home page

ఇండియన్ కబడ్డీ కోచ్ గా శ్రీనివాస్ రెడ్డి

Mar 15 2016 3:22 AM | Updated on Sep 3 2017 7:44 PM

ఇండియన్ కబడ్డీ కోచ్ గా శ్రీనివాస్ రెడ్డి

ఇండియన్ కబడ్డీ కోచ్ గా శ్రీనివాస్ రెడ్డి

మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఉత్తర్‌పల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇండియన్ కబడ్డీ టీం కోచ్‌గా ఎంపికయ్యా రు.

ఉత్తర్‌పల్లివాసికి అరుదైన గౌరవం
ఇరాన్‌లో పాల్గొనే జట్టుకు శిక్షణ ఇచ్చే అవకాశం

 సాక్షి, సంగారెడ్డి  : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఉత్తర్‌పల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇండియన్ కబడ్డీ టీం కోచ్‌గా ఎంపికయ్యా రు. ఇరాన్‌లో వచ్చేనెల జరగనున్న ఏషియన్ కబడ్డీ చాంపియన్ షిప్‌లో పాల్గొనే భారత కబడ్డీ జట్టుకు శ్రీనివాస్‌రెడ్డి కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈనెల 16 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని స్టోర్ప్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో ఏషియన్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే కబడ్డీ జట్టుకు కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నారు. కోచింగ్ క్యాంపుకు ఎంపికైన కబడ్డీ మహిళా, పురుష క్రీడాకారులకు ఎల్.శ్రీనివాస్‌రెడ్డి శిక్షణ ఇవ్వనున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కోచ్ హోదాలో వచ్చేనెల 13 నుంచి ఇరాన్‌లో జరిగే ఏషియన్‌కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలకు కబడ్డీ జట్టు వెంట వెళ్లనున్నారు. ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్‌లో పాల్గొంటున్న తెలుగు టైటాన్స్ జట్టుకు కోచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.

గతంలో దక్షిణా కొరియా జట్టుకు సైతం శ్రీనివాస్‌రెడ్డి కోచ్‌గా పనిచేశారు. సంగారెడ్డి మండలం ఉత్తర్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కబడ్డీ క్రీడాకారునిగా కేరీర్ ప్రారంభించారు. జాతీయ భారత కబడ్డీ జట్టును దేశ, విదేశాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పలు పథకాలు సాధించారు. ప్రస్తుతం ఆంధ్రబ్యాంకు కబడ్డీ జట్టుకు కెప్టెన్ వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి గత కొంతకాలంగా కోచ్‌గా పనిచేస్తున్నారు. భారత జట్టుకు కోచ్‌గా ఎంపికకావటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏషియన్ కబడ్డీ చాంపియన్‌లో పాల్గొనే కబడ్డీ జట్టుకు శిక్షణ ఇవ్వటం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement