వాకింగ్ చేయడాన్ని రోటీన్ పనిగా, తేలిగ్గా చూస్తాం. కానీ ఇది అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చేసే తీరులో సరైన విధానం ఉంటే వాకింగ్‌కి మించిన వర్కౌట్ లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాంతో బరువుని సులభంగా నిర్వహించొచ్చు, అధిక బరువు అనే సమస్య రాదు అని నమ్మకంగా చెబుతున్నారు. అంతేగాదు భోపాల్‌కు చెందిన పోషకాహార నిపుణురాలు, ఆరోగ్యకోచ్ రేణు రఖేజా ఈజీగా చేసే ఐదు రకాల వాక్‌లను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని శరీర తీరుని మార్చగలవని చెబుతోందామె. పైగా జిమ్‌కి వెళ్లాల్సిన పని ఉండదు అని అంటున్నారు. మరి ఆ ఐదు వాక్‌లేంటో చూద్దామా..!.
నడకకు మించిన అద్భుతమైన వ్యాయామం మరొకటి లేదని అంటోంది రేణు రఖేజా. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని అంటున్నారు. జిమ్‌కి వెళ్లలేం. ఎక్కువ సమయం వ్యాయమాలకు కేటాయించలేం అనుకునేవాళ్లు సింపుల్‌గా ఈజీగా చేసే ఈ ఐదు వాక్‌లు చేస్తే చాలట. అద్భుతంగా బరువుని నిర్వహించడమే గాక హెల్దీగా ఉంటారని అంటోంది.
కాలి నడక (తడసానా) - 1 నిమిషం
ఇది నడక భంగిమను మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. చేతులు నిటారు తలపైకి చాచి కాళ్ల మీద నడవండి.
మడమ నడక - 1 నిమిషం
మడమ నడకలు చీలమండలను బలోపేతం చేస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ/ప్రసరణను నిర్ధారిస్తాయి, వాపును తగ్గిస్తాయి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడూ.. ఫోజ్ నిటారుగా ఉంచాలి.
హిప్ రొటేషన్ నడక - 1 నిమిషం
హిప్ రొటేషన్ నడక బిగుతుగా ఉన్న తుంటిని వదులు చేయడం ద్వారా హిప్ కదలికను మెరుగుపరుస్తుంది. ఇది వీపు దృఢత్వాన్ని తగ్గిస్తుంది, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం చేయడానికి, కాలును పైకి లేపి మీ పాదాన్ని నేలపై ఉంచే ముందు తిప్పండి. మరొక కాలుతో కూడా ఇలానే రిపీట్ చేయండి
సైడ్ బై సైబ్ వాక్..1 నిమిషం
ఈ వ్యాయామం టోన్డ్ తొడలను సాధించడానికి, తుంటి కండరాలను నిర్మించడానికి, సమతుల్యతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ముందుగా చేతులను ముందు పట్టుకుని, మోకాళ్లను వంచి పక్కకు నడవండి.
రివర్స్ వాక్ (వెనుకకు నడవడం) - 2 నుంచి5 నిమిషాలు
రివర్స్ లేదా బ్యాక్ వాక్స్ మోకాలి నొప్పిని తగ్గిస్తాయి, స్థిరత్వాన్ని పెంచుతాయి, కీళ్ల నొప్పిని నివారిస్తాయి. ఇది చాలా సులభం కూడా. చేయాల్సిందల్లా వెనుకకు నడవడమే, దాదాపు చంద్రుని నడక లాగా కానీ నెమ్మదిగా.
చివరిగా శరీరం చెప్పేది వినండి, కొత్త వ్యాయామం లేదా వర్కౌట్లను ప్రారంభించే ముందు సంబంధిత ఆరోగ్య నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులను సంప్రదించండి. అలాగే మీకు కీళ్ల నొప్పులు, లేదా ఇతర వైద్య పరిస్థితులు ఉంటే..నిపుణులు సలహాలు సూచనలతో ప్రారంభిస్తేనే చాలామటుకు మంచిది అని సూచించింది రేణు రఖేజా.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: అలా ఉంటే..డయాబెటిస్ బోర్డర్‌లోకి వచ్చినట్లే..?)


