source: X
దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్‌ఫైనల్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దారుణంగా నిరాశపరిచాడు. రెడ్‌బాల్ క్రికెట్ తొలి పరీక్షలోనే అతడు ఘోరంగా విఫలమయ్యాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇవాళ ప్రారంభమైన మ్యాచ్‌లో వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపిక కావడం అతడి రెడ్‌బాల్ సామర్థ్యాన్ని పరీక్షించే కీలక అవకాశంగా ఉండింది. అయితే ఈ అవకాశాన్ని వైభవ్ ఒడిసిపట్టుకోలేకపోయాడు. తక్కువ స్కోర్‌కే ఔటై, అభిమానులను నిరాశపరిచాడు.
ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్‌కు దిగగా, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి వైభవ్ ఓపెనర్‌గా వచ్చాడు. రెండో ఓవర్‌లో బంతిని ఎదుర్కొన్న అతడు బిష్వర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో భారీ స్కోర్ చేసేలా కనిపించాడు.
అయితే అదే ఓవర్ చివరి బంతికి అతడి ఇన్నింగ్స్ ముగిసింది. కొంథౌజమ్ ఆఫ్ స్టంప్ వెలుపల గుడ్ లెంగ్త్‌లో బంతిని వేశాడు. దానిని పాయింట్ దిశగా ఆడేందుకు ప్రయత్నించగా, గల్లీలో ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
వైట్‌బాల్ క్రికెట్‌లో దూకుడుగా ఆడే వైభవ్‌కు రెడ్‌బాల్ ఫార్మాట్‌లో ప్రధాన సవాలు షాట్ ఎంపిక, ఓపికగా బ్యాటింగ్ చేయడం. కొత్త బంతిపై ప్రతి బంతినీ దాడి చేయకుండా, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ గేర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
సూర్యవంశీకి ఇదే మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో మరో అవకాశం లభించే అవకాశం ఉంది. అక్కడ భారీ స్కోరు సాధిస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఎదురైన వైఫల్యాన్ని కొంతవరకు భర్తీ చేయడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని రెడ్‌బాల్ అవకాశాలకు తనను తాను బలంగా ప్రతిపాదించుకోగలడు.
మ్యాచ్ విషయానికొస్తే.. 27 ఓవర్లు ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ స్కోర్ 13-4గా ఉంది. అభిమన్యు ఈశ్వరన్ (15), వైభవ్ సూర్యవంశీ (8), కుమార్ కుషాగ్రా (55), విరాట్ సింగ్ (2) ఔట్ కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (4), సుదీప్ కుమార్ ఘరామీ (49) క్రీజ్‌లో ఉన్నారు.


