వినాయక ఆగమన్‌లో విషాదం.. ఇద్దరు మృతి! | Mumbai Tragedy Ganesh Idol Collapses During Procession 2 Dead 5 Injured | Sakshi
Sakshi News home page

వినాయక ఆగమన్‌లో విషాదం.. ఇద్దరు మృతి!

Aug 23 2026 8:01 AM | Updated on Aug 23 2026 8:01 AM

Mumbai Tragedy Ganesh Idol Collapses During Procession 2 Dead 5 Injured

ముంబై: మహానగరం ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ‘భులేశ్వర్‌చా రాజా’ వినాయక విగ్రహ ఆగమన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ విగ్రహం రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 9:51 గంటల సమయంలో భులేశ్వర్‌లోని జై అంబే చౌక్, కబూతర్‌ఖానా సమీపంలో విగ్రహాన్ని తీసుకొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న వెంటనే బీఎంసీ సిబ్బంది, ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, 108 అత్యవసర అంబులెన్స్ సిబ్బంది సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని జీటీ ఆస్పత్రికి తరలించారు.
 

అక్కడ వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతులను సంకేత్ నేవ్‌శే (33), బ్రిజేష్ హేమంత్ జోషి (30)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిలో ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ‘భులేశ్వర్‌చా రాజా’ వేడుకల కోసం భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: పర్షియన్ గల్ఫ్‌లో ‘మంటలు’.. యూఎస్ వైఖరిపై ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement