breaking news
vinayaka idol
-
16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహం గుర్తింపు
సాక్షి,మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహాన్ని గుర్తించినట్టు ఔత్సాహిక పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పశువుల దొడ్డిలో ఈ విగ్రహాన్ని కనుగొన్నట్టు పేర్కొన్నారు. విగ్రహం ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో డమరుకం ఉన్నట్టు తెలిపారు. మైసూరు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి విగ్రహం గురించి తెలియజేయగా, అది 16వ శతాబ్దం నాటిదని ఆయన చెప్పినట్టు రమేష్ తెలిపారు. -
గణేశా.. ఏమిటీ ట్రాఫిక్ జామ్?
-
గణేశా.. ఏమిటీ ట్రాఫిక్ జామ్?
వివిధ ప్రాంతాలనుంచి భారీగా వస్తున్న వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ నిదానంగా కొనసాగడంతో నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జాం అయింది. వినాయక విగ్రహాలు ఎక్కడికక్కడ రోడ్ల పై నిలిచి ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా కోఠి నుంచి బంజారాహిల్స్, హైటెక్ సిటీ వైపు రావాల్సిన వాహనచోదకులకు ట్రాఫిక్ చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ రోడ్లను బారికేడ్లతో మూసేయడంతో ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ఇక సిటీ బస్సులలో వెళ్లే వాళ్లకయితే అంతా అయోమయమే. ఎక్కిన బస్సు ఎటు వెళ్తుందో, అసలు వెళ్తుందో వెళ్లదో, గమ్యం చేరుకుంటుందో లేదో తెలియదు. కండక్టర్లను అడిగితే, ''ఎక్కడికి వెళ్లాలో అక్కడికే టికెట్ తీసుకోండి.. బస్సు ఎక్కడ ఆగిపోతే అక్కడ దిగిపోండి. ఎటు వెళ్తుందో, ఎటు తిరుగుతుందో మాకు తెలీదు'' అనే సమాధానం ఎదురైంది. కోఠి నుంచి లక్డీకాపుల్ వచ్చేందుకు మామూలుగా అయితే 10-15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కానీ సోమవారం ఉదయం మాత్రం దాదాపు 45 నిమిషాల వరకు పట్టింది. అది కూడా కోఠి నుంచి అబిడ్స్ వెళ్లకుండా నారాయణగూడ మీదుగా బషీర్బాగ్ మీదుగా లక్డీకాపుల్ చేరుకోవాల్సి వచ్చింది. సోమవారం ఉదయం ఆఫీసుకు బయలుదేరిన వారు ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోఠి, సికింద్రాబాద్, అఫ్జల్ గంజ్, హిమాయత్ నగర్ల నుంచి ట్యాంక్ బండ్ వైవు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. గతంలో కూడా గణేశ్ నిమజ్జనాలు జరిగినా, ఎప్పుడు మర్నాటి ఉదయం ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన దాఖలాలు లేవని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక ఖైరతాబాద్ మహాగణేశుడి విగ్రహాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు వేదిక నుంచి ప్రత్యేక వాహనం మీదకు చేర్చారు. శోభాయాత్ర ప్రారంభం కూడా చాలా ఆలస్యం అయ్యేలా ఉంది. ట్యాంక్ బండ్ వద్ద మామూలుగా చేసే విగ్రహాల నిమజ్జనమే ఇంకా పూర్తి కాకపోవడంతో దీనికి అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఇక ఆ విగ్రహం శోభాయాత్ర జరిగే సమయంలో ఖైరతాబాద్ నుంచి సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ మరింత దారుణంగా ఉంటుంది. -
నిమజ్జనానికి వెళ్లి వ్యక్తి గల్లంతు
సీతానగరం(తూర్పుగోదావరి): ఓ వ్యక్తి నిమజ్జనానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని రఘుదేవాపురం గ్రామానికి చెందిన పోచయ్య(20), నిమజ్జనానికి వెళ్లి ముగ్గళ్లలోని గోదావరి రేవులో గల్లంతయ్యాడు. బాధితుడి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
ఆదిలాబాద్: వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వినాయక నిమజ్జనానికి వెళుతున్న సమూహానికి కరెంట్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామంలో చోటుచేసుకుంది. కరెంట్ షాక్ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో తీవ్రగాయాలైన మరోవ్యక్తికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.