Photo Credit: Twitter
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు 2024లో క్లాసికల్ వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన తర్వాత మరో టైటిల్ సాధించలేకపోయాడు. ఆ తర్వాత నుంచి గుకేశ్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గుకేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర స్టోరీని పంచుకున్నాడు.
‘ఒక క్రిటిక్ తనతో చాట్‌లో భాగంగా రిటైర్ అవ్వమని సలహా ఇచ్చాడు. ఇప్పుడు అదే క్రిటిక్ తనతో చెస్ ఆడాలని చాలెంజ్ చేశాడు. కానీ నేను తెలివిగా అతడికి సారీ, నేను రిటైర్ అయ్యా కదా బ్రో’ అని సమాధానం ఇచ్చాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గుకేశ్ ఇన్‌స్టా స్టోరీ ట్రెండింగ్‌గా మారిపోయింది. ఇక గుకేశ్ ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్‌లో చెస్ ఒలింపియాడ్ 2026లో బిజీగా గడుపుతున్నాడు.
ఇక ఏడాది వ్యవధిలో ఫామ్‌లేమితో గుకేశ్ 73 రేటింగ్ పాయింట్లు కోల్పోయి ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌లో 32వ స్థానంలో కొనసాగుతున్నాడు. గుకేశ్ ఖాతాలో 2,703 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గత 10 గేముల్లో గుకేశ్ ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించడం విశేషం.

Read: యూఎస్ ఓపెన్ బరిలో అల్కరాజ్.. టైటిల్ నిలబెట్టుకునేనా?


