అనురాగ బంధానికి అడ్డంకులు లేవని..! | GHMC Employee Ties Rakhi With Her Toes | Sakshi
Sakshi News home page

అనురాగ బంధానికి అడ్డంకులు లేవని..!

Aug 29 2026 1:02 PM | Updated on Aug 29 2026 1:54 PM

GHMC Employee Ties Rakhi With Her Toes

సాక్షి, హైద‌రాబాద్‌: ఆత్మీయ బంధానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించారు ఓ మహిళా ఉద్యోగి. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వైష్ణవి.. చేతులు పని చేయకపోయినా రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సహోద్యోగులకు కాలి వేళ్లతోనే ఇలా రాఖీ కట్టారు. 

గతంలో తెలంగాణ అవతరణోత్సవాల సందర్భంగా గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా చిత్రపటాన్ని కాలివేళ్లతో చిత్రీకరించి బహూకరించారు. వైష్ణవిని ఆయన ప్రశంసించి ఆశీర్వదించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పలు సందర్భాల్లో వైష్టవి పట్టుదలను సోషల్‌ మీడియా వేదికగానూ ప్రస్తావించారు.

ఇదీ చ‌ద‌వండి: తండ్రిని కాపాడిన 10 ఏళ్ల కూతురు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement