ఇవి ఖరీదైన ఎన్నికలు | Jubilee Hills Co-operative House Building Society Elections | Sakshi
Sakshi News home page

ఇవి ఖరీదైన ఎన్నికలు

Aug 29 2026 1:30 PM | Updated on Aug 29 2026 1:39 PM

Jubilee Hills Co-operative House Building Society Elections

రేపు జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఎన్నికలు 

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఈ నెల 30న జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనుంది. బొల్లినేని రవీంద్రనాథ్, బొల్లినేని శీనయ్య ప్యానెళ్ళు గట్టిగా పోటీ పడుతున్నారు. మొత్తం 4039 ఓట్లు ఉన్న ఈ సొసైటీ ఆసియాలోనే బెస్ట్‌ ఎలైట్‌ సొసైటీగా పేరొందింది. 1160 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలనీ ఉండగా 80 శాతం నివాసితులు కోటీశ్వరులుగా నమోదై ఉన్నారు. 

ఈ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వీవీఐపీలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఓటు హక్కు వినియోగించుకోనున్నాయి. ఓటు హక్కు కలిగిన వారిలో సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేష్‌బాబు, అల్లు అర్జున్, జూనియర్‌ ఎన్టీఆర్‌ పాటు నిర్మాత నాగవంశీ, ఏషియన్‌ మూవీస్‌ సునీల్‌ నారంగ్, జస్టిస్‌ చలమేశ్వర్, జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ కౌశిక్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, హెటిరో డ్రగ్స్‌ పార్థసారధి రెడ్డి, ఎంఎస్‌ఎన్‌ ఫార్మా అధినేతి, దివీస్‌ ల్యాబ్స్‌ అధినేతతో, ప్రముఖ బిల్డర్లు డీఎస్‌ఆర్, జీవీపీఆర్, కేఎన్‌ఆర్‌లతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు,  మంత్రులు, ఎంపీలు ప్రముఖ వ్యాపారులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. 

4039 మంది ఓటర్లలో 1656 మంది వీవీఐపీలు ఉన్నారు. ఇందులో 95 మంది మల్టీ మిలీయనర్లు ఉండగా 68 మంది భారతదేశ టాప్‌ 100 ధనవంతుల్లో ఉన్నవారు ఉన్నారు. ఈ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement