సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మద్దూనూరు నుంచి జగిత్యాల వస్తుండగా ఘటన జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సు డ్రైవర్ లక్ష్మణ్‌కు గుండెపోటు రావడంతో ఆయన స్టీరింగ్‌పై పడిపోయారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును స్లో చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 108కు ఫోన్ చేసినా స్పందించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటోలో డ్రైవర్ లక్ష్మణ్‌ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ లక్ష్మణ్.. సోమవారం రిటైర్ కానున్నారు. ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పినా డ్రైవింగ్ డ్యూటీ వేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్‌కు గుండెపోటుతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి: అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్


