నా బిడ్డకు తండ్రి నువ్వే.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం! | Gadwal District Mother and Son Incident | Sakshi
Sakshi News home page

నా బిడ్డకు తండ్రి నువ్వే.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం!

Aug 29 2026 11:31 AM | Updated on Aug 29 2026 12:49 PM

Gadwal District Mother and Son Incident

సాక్షి, గద్వాల (ధరూరు): తనకు తండ్రి గుర్తింపు ఇవ్వాలని ఓ యువకుడు ధర్నాకు దిగిన ఘటన మండల పరిధిలోని చింతలరేవులలో శుక్రవారం జరిగింది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో 20 ఏళ్ల క్రితం మైనర్ అయిన తన తల్లి పనికి వెళ్లగా ఆ సమయంలో ఆమెను నమ్మంచి మోసం చేశాడని, ఇన్నేళ్లుగా తన తల్లి మనో వేదనను అనుభవిస్తూ ఉందని, తనకు తండ్రి గుర్తింపు ఇవ్వాలని మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు బైఠాయించారు.

తాను ఆయన సంతానమేనని ఇప్పుడు 20 ఏళ్లు పైబడి ఉన్నాయని.. డీఎన్ఏ పరీక్షకు సైతం సిద్ధమేనన్నాడు. ఈ విషయమై చేతబడి చేసి చంపు తానని బెదిరిస్తున్నాడని ఆరోపించాడు. చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలంటూ  యువకుడు, అతడి తల్లి కలిసి ఇంటి ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని, ఇంటి వద్ద కూర్చుంటే న్యాయమెలా జరుగుతుందన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితులు పేర్కొంటున్నారు. 

చదవండి: ‘అంతా ఆ ఉంగరం వల్లే’..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement