వెన్నెముకకు మేలు చేసే ఈ ఆసనం గురించి తెలుసా? | Tadasana Steps Benefits Posture Balance Spine Health | Sakshi
Sakshi News home page

వెన్నెముకకు మేలు చేసే ఈ ఆసనం గురించి తెలుసా?

Aug 29 2026 12:47 PM | Updated on Aug 29 2026 12:55 PM

Tadasana Steps Benefits Posture Balance Spine Health

లైఫ్‌

ఏకాగ్రత కోసం తాడాసనం

యోగా

రీరాన్ని నిటారుగా, సమతుల్యంగా ఉంచేందుకు యోగా ఆసనాలు ఎంతో ఉపయోగపడతాయి. అందులో సులభంగా చేయగల ఆసనాల్లో తాడాసనం ఒకటి. క్రమం తప్పకుండా సాధన చేస్తే శరీర భంగిమ, బ్యాలెన్స్‌తో పాటు కండరాల టోన్‌ను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.

ఎలా చేయాలి?

రెండు పాదాలను కలిపి లేదా కొద్దిగా దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి.

చేతులను శరీరం పక్కన ఉంచాలి.

శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందుకు, పైకి తీసుకెళ్లి తలపైకి పెట్టాలి.

అరచేతులను కలిపి లేదా ఒకదానికొకటి ఎదురుగా ఉంచి, కాళ్లపై సమంగా బరువు ఉంచి, వెన్నెముకను పైకి పొడిగించాలి.

సౌకర్యంగా ఉంటే మడమలను పైకి లేపి పాదాల వేళ్లపై నిలబడాలి.

చూపును ఒక స్థిరమైన బిందువుపై ఉంచి, సాధారణంగా శ్వాస తీసుకుంటూ 10–20 సెకండ్లు ఉంచాలి.

శ్వాస వదులుతూ మడమలను దించి, చేతులను కిందకు తీసుకురావాలి.

ప్రయోజనాలు...

శరీర భంగిమను (Post-ure) సరిచేయడంలో సహాయపడుతుంది.

బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది.

మొత్తం శరీరంలోని కండరాల టోన్‌ను మెరుగుపరుస్తుంది.

వెన్నెముకను పొడవుగా చేసి, దానిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ముందు మూడు లైన్ల స్టార్టింగ్‌ కథనంతో పాటు అన్నీ ఇవ్వండి
– అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌

ఇవి చదవండి: పైసా ఖర్చు లేకుండా చర్మానికి మెరుపు.. ఈ 3 అలవాట్లు చాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement