ఎండ తగులుతున్నా.. విటమిన్‌-డి రావడం లేదా? షాకింగ్‌ నిజాలు! | Vitamin-D Deficiency In India Despite Abundant Sunlight | Sakshi
Sakshi News home page

ఎండ తగులుతున్నా.. విటమిన్‌-డి రావడం లేదా? షాకింగ్‌ నిజాలు!

Aug 29 2026 9:03 AM | Updated on Aug 29 2026 9:03 AM

Vitamin-D Deficiency In India Despite Abundant Sunlight

లైఫ్‌

హెల్త్‌

నదేశంలో అన్ని కాలాల్లోనూ సూర్యరశ్మి సమృద్ధిగా ఉంటుంది. అయినప్పటికీ సుమారుగా 70 నుంచి 90 శాతం మంది ‘విటమిన్‌–డి’ లోపంతో బాధపడుతున్నారని పలు వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. ఒంటికి ఎండ తగిలితే విటమిన్‌–డి దానంతట అదే తయారవుతుంది. మరి అలాంటప్పుడు ఈ స్థాయి లోపం ఎందుకు వస్తుందంటే.. జీవనశైలే కారణం..

నాలుగు గోడల మధ్యే:
ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగాలు, ఏసీ గదులు, ఆన్‌ లైన్‌ చదువుల వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ముఖం చూడకుండానే సమయం గడిచిపోతోంది.
మెలనిన్‌:
భారతీయుల చర్మంలో ఉండే మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం సహజమైన సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల మన చర్మం సూర్యరశ్మిని తీసుకునే సామర్థ్యం తక్కువ. అందువల్ల ఎక్కువ సమయం ఎండలో గడ΄ాల్సి ఉంటుంది.

సరైన సమయం:
చాలామంది ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేస్తూ ఎండ తగులుతోంది అనుకుంటారు. కానీ సూర్యరశ్మి నుంచి విటమిన్‌–డి లభించాలంటే ఆ కిరణాలు చర్మాన్ని తాకాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సూర్యకిరణాలు అత్యధికంగా ప్రసరిస్తాయి. కానీ, ఆ సమయంలో ఉండే ఎండ తీవ్రత వల్ల ఆ సమయంలో బయటకు రావడానికి ఇష్టపడం.

కాలుష్యం:
నగరాల్లో పేరుకుపోతున్న ధూళి, పొగ సూర్యకాంతిని నేరుగా భూమిపై పడకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల కూడా మనకు తగినంత సూర్యరశ్మి లభించదు. విటమిన్‌–డి కేవలం ఎముకల గట్టితనానికే కాకుండా, మన ఇమ్యూనిటీకి, గుండె ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో కీలకం. అందువల్ల ప్రతిరోజూ కాసేపు ఎండలో గడపడం మన దినచర్యలో భాగం చేసుకుంటే విటమిన్‌–డి లోపంతో డీలా పడాల్సిన అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి: ఆఫీస్‌ వర్క్‌లో ఫోకస్‌ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్‌ తప్పనిసరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement