ఆఫీస్‌ వర్క్‌లో ఫోకస్‌ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్‌ తప్పనిసరి! | Five Minute Micro Breaks Boost Focus And Reduce Office Fatigue | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌ వర్క్‌లో ఫోకస్‌ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్‌ తప్పనిసరి!

Aug 29 2026 8:35 AM | Updated on Aug 29 2026 8:35 AM

Five Minute Micro Breaks Boost Focus And Reduce Office Fatigue

లైఫ్‌

ఫీసులో అలసిపోయిన ప్రతిసారీ మన ఆలోచన కాఫీ, టీ వైపు మళ్లుతుంది. కాఫీ, టీలో ఉండే కెఫిన్‌ అలసటను తగ్గించిన ఫీలింగ్‌నిస్తుంది.. కానీ కోల్పోయిన శక్తిని పునరుద్ధరించదు. అయితే ఆ ఐదు నిమిషాల చిన్న బ్రేక్‌ మాత్రం మన మెదడును మరింత ఉత్సాహంగా పనిచేసేలాప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

  • పని మధ్యలో తీసుకునే 5 నిమిషాల ‘మైక్రో బ్రేక్‌’ మెదడును నేచురల్‌గా రీసెట్‌ చేయడానికి సహాయపడుతుంది. 90 నుంచి 120 నిమిషాలు పనిచేసిన తర్వాత మెదడు పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. ఆ సమయంలో తీసుకునే చిన్న విరామం ఆలోచనా శక్తికి కొత్త ్ర΄ాణం పోస్తుంది.

  • ఐదు నిమిషాల మైక్రో బ్రేక్స్‌ తీసుకోవడం వల్ల ఉద్యోగులలో స్ట్రెస్‌ తగ్గి, చేస్తున్న పనిపై ఫోకస్‌ శక్తి స్థాయిలు దాదాపు 32% నుంచి 40% వరకు పెరుగుతున్నాయని పరిశోధనలు తేల్చాయి.

  • నిరంతరం బ్రేక్‌ లేకుండా పనిచేసే వారిలో ‘బర్నౌట్‌’ వేగంగా వస్తుంది. ప్రతి గంటకు ఒక చిన్న విరామం తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం తగ్గుతుంది.

  • కంప్యూటర్‌ స్క్రీన్ల వైపే చూసే ఉద్యోగులు 20–20–20 సూత్రాన్ని (ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల ΄ాటు చూడటం) లేదా 5 నిమిషాలు సీటు వదిలి కలయతిరగడం వల్ల కంటి అలసట తగ్గుతుంది.

  • అయితే బ్రేక్‌ సమయంలో కూడా మెయిల్స్, ఫోన్‌ నోటిఫికేషన్లు చూడటం వల్ల మానసిక అలసట అలాగే ఉంటుంది. ఫోన్‌ పక్కన పెట్టి కాసేపు నడుస్తూ .. కాఫీ తాగడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. అలసట దూరమవుతుంది.

ఇవీ చదవండి: డిగ్రీ కాదు.. స్కిల్స్‌ ఉంటే చాలు! ఈ రాష్ట్రం టాప్‌లో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement