లైఫ్
ప్లాస్టిక్ చెత్తను పారేయకుండా.. దానితోనే పిల్లలకు ఉచితంగా చదువు చెప్తోంది అస్సాంలోని ఒక పాఠశాల. మనం పడేసే ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బాటిళ్లే ఇక్కడ పిల్లలకు ‘స్కూల్ ఫీజు’! పిల్లలకు విజ్ఞానాన్ని పంచడంతో పాటు పర్యావరణ హితమే ప్రధాన ధ్యేయంగా సాగుతున్న ఈ పాఠశాల అందరిచే ప్రశంసలు పొందుతోంది.
అస్సాంలోని పమోహి గ్రామంలో పేదరికం తాండవించేది. చాలా కుటుంబాలు రాతి గుహల్లో పని చేస్తూ జీవనం సాగించేవి. డబ్బు లేక పిల్లలు బడి మానేసి పనుల్లోకి వెళ్లేవారు. మరోవైపు గ్రామంలో తీవ్ర ప్లాస్టిక్ సమస్య ఉండేది. చలికాలంలో వెచ్చదనం కోసం గ్రామీణులు ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టేవారు. ఆ విషపూరిత పొగ కారణంగా పాఠశాలలో పిల్లలు తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు.
అలా ఈ రెండు సమస్యలకు పరిష్కారం దిశగా మజిన్ ముఖ్తార్, ఆయన భార్య పర్సిత శర్మ కలసి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 2016లో కేవలం 20 మంది పిల్లలతో ‘అక్షర్’పాఠశాలను ్రపారంభించారు. డబ్బులకు బదులుగా ప్లాస్టిక్ వ్యర్థాలనే ఫీజుగా నిర్ణయించారు. దీనికి తోడు ప్రతి కుటుంబం ప్లాస్టిక్ తగలబెట్టబోమని ప్రతిజ్ఞ కూడా చేసేలా ఒప్పించారు.
ప్లాస్టిక్‌ని ఏం చేస్తారు?
పాఠశాలలో ప్రతి విద్యార్థి వారానికి కనీసం 25 ప్లాస్టిక్ ముక్కలను ఫీజుగా తీసుకురావాలి. అలా ΄ోగుచేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ‘ఇకో బ్రిక్స్’ కి రూపకల్పన చేస్తున్నారు. వీటితో స్కూల్ ఆవరణలో నడిచే దారులు, బెంచీలు, పూల కుండీలు నిర్మించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కూడా!
ఈ స్కూల్‌లోని విద్యార్థులకు చదువుతో పాటు కార్పెంట్రీ, ఎలక్ట్రానిక్స్, సోలార్ ΄్యానెల్ ఇన్సా›్టలేషన్, ప్రథమ చికిత్స వంటి ్రపాక్టికల్ విద్యను కూడా నేర్పిస్తారు. కోవిడ్–19 లాక్‌డౌన్ సమయంలో ఈ స్కూల్ విద్యార్థులు సామాజిక కార్యకర్తలుగా మారి గువాహటి పరిసర ్రపాంతాల్లోని దాదాపు 15,000 మందికి నిత్యావసర సరుకులు అందించారు. ఒకప్పుడు పాఠశాల మెట్లు ఎక్కలేని ఎంతోమంది పేద పిల్లలు నేడు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ ఒక్క స్కూల్‌తో ్రపారంభమయిన ఈ పర్యావరణ పరిరక్షణ నేడు ఆ చుట్టు పక్కల ఉన్న పాఠశాలల్లోకి కూడా విస్తరించింది. ఉపాధిని, చదువును, పర్యావరణ పరిరక్షణను ఒకే తాటిపైకి తెచ్చిన అక్షర్ స్కూల్ విద్యా వ్యవస్థకే ఒక కొత్త దిశానిర్దేశం చేస్తోంది.
ఇవీ చదవండి: డిగ్రీ కాదు.. స్కిల్స్ ఉంటే చాలు! ఈ రాష్ట్రం టాప్‌లో!


