లైఫ్
చర్మం కాంతిమంతంగా ఉండటం కోసం రకరకాలుగా ప్రయత్నించి అలసిన వారికి పైసా ఖర్చు లేకుండానే చర్మాన్ని మెరిపించుకునేందుకు కొన్ని మంచి చిట్కాలు ఉన్నాయి. అది ప్రయత్నించి చూస్తే మేనికాంతితోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేంటో చూద్దామా...
అవి ఏమిటో కాదు... ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగడం, సూర్యకాంతిలో సేదతీరడం, ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవడం వంటివే... లేవగానే గ్లాసుడు నీళ్లు తాగడం వల్ల రాత్రంతా శరీరంలో తగ్గిన నీటి శాతం మళ్లీ సమకూరుతుందంటున్నారు నిపుణులు. ఇది రోజును ఒక ఆరోగ్యకరమైన అలవాటుతో ప్రారంభించేలా చేస్తుంది.
తేలికపాటి వ్యాయామాలు
ఉదయాన్నే శరీరాన్ని సాగదీయడం, యోగా చేయడం లేదా కాసేపు నడవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఉదయం పూట శరీరం పట్టివేసినట్లు ఉండే సమస్యను తగ్గించడమే కాకుండా, మనస్సుకు ఆనందాన్ని ఇచ్చే ‘న్యూరోట్రాన్స్‌మీటర్ల’ ఉత్పత్తిని పెంచుతుంది.
మెడిటేషన్
రోజుకు కేవలం 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేయడం లేదా లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడిస్థాయులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రోజంతా పనులను తొందరపాటు లేకుండా ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. వీటన్నింటి వల్లా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలం. అలా ఉంటే మేనిమెరుపులు సింపులే కదా మరి!
ఇవి చదవండి: పాప్‌కార్న్ పేలేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? షాకింగ్ నిజాలు!


