పాప్‌కార్న్‌ పేలేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? షాకింగ్‌ నిజాలు! | Interesting Popcorn Facts History And Science | Sakshi
Sakshi News home page

పాప్‌కార్న్‌ పేలేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? షాకింగ్‌ నిజాలు!

Aug 29 2026 12:25 PM | Updated on Aug 29 2026 12:32 PM

Interesting Popcorn Facts History And Science

లైఫ్‌

సరదాగా చదివేయండి!

పాప్‌ కార్న్‌ ఎనీ టైమ్‌ స్నాక్‌.. సరదా కోసం ఎప్పుడు తినాలనిపించినా తింటుంటాం.. మరి పాప్‌ కార్న్‌కీ కొన్ని సరదా ముచ్చట్లున్నాయి. సరదాగా చదివేయండి.

ఓల్డ్‌ మెయిడ్స్‌ – గింజలన్నీ పగిలి పాప్‌కార్న్‌ అయినా, గిన్నె అడుగున కొన్ని విత్తనాలు అలాగే ఉండిపోతాయి చూశారా? వాటికి అధికారికంగా ఒక పేరుంది... అదే ‘ఓల్డ్‌ మెయిడ్స్‌’! గింజ లోపల తగినంత తేమ లేకపోవడం వల్ల ఇవి పేలలేవు. పాప్‌కార్న్‌ బయట నుంచి ఎండిపోయినట్లు కనిపించినప్పటికీ, దాని లోపల దాదాపు 13% నుంచి 15% వరకు తేమ ఉంటుంది. గింజను వేడి చేసినప్పుడు, లోపల ఉన్న నీరు ఆవిరిగా మారడం ప్రారంభించి పాప్‌ కార్న్‌గా పనిచేస్తుంది.

  • ఒక చిన్న పాప్‌కార్న్‌ గింజ పేలినప్పుడు గాలిలోకి ఏకంగా 3 అడుగుల (సుమారు 1 మీటరు) ఎత్తు వరకు ఎగురుతుంది. దాని పరిమాణంతో పోలిస్తే, ఇది ఒలింపిక్‌ హై జంపర్‌ కంటే ఎత్తుకు ఎగిరినట్లే!

  • పాప్‌కార్న్‌ పేలినపుడు ఏర్పడే రూపాలను బట్టి రెండు రకాలుగా విభజిస్తారు.  బటర్‌ ఫ్లై ఆకారం– ఇవి బటర్‌ఫ్లై రెక్కల ఆకారంలో ఉంటాయి. వీటిని ఎక్కువగా థియేటర్లలో ఉపయోగిస్తారు. మష్రూమ్‌ ఆకారం– గుండ్రంగా, పుట్టగొడుగులా ఉండే ఆకారం. కెరమెల్‌ పాప్‌కార్న్‌ తయారీలో విరిగిపోకుండా ఉండేందుకు వీటిని వాడతారు.

  • 1920ల కాలంలో సినిమా థియేటర్ల యజమానులు పాప్‌కార్న్‌ను నిషేధించారు. కారణం... థియేటర్లు చాలా రిచ్‌గా కనిపించాలని, పైగా జనాలు నమిలే శబ్దం వల్ల సినిమాల్లోని సంభాషణలు వినపడవని భయపడ్డారు. కానీ ఆర్థిక మాంద్యం వచ్చాక, ఇది చాలా చవకైన వ్యాపారమని మళ్లీ ప్రవేశపెట్టారు.

  • పూర్వం అమెరికాలోని ఆదివాసీలు మొక్కజొన్న కంకులను నేరుగా వేడి ఇసుకలో లేదా మంటల్లో వేసి, అవి పేలి బయటకు ఎగురుతున్నప్పుడు పట్టుకునేవారు.

  • పాప్‌కార్న్‌ పేలినపుడు వచ్చే శబ్దం విత్తనం పొర పగలడం వల్ల రాదు. లోపల ఉన్న నీటి ఆవిరి ఒక్కసారిగా సూపర్‌సోనిక్‌ స్పీడ్‌తో బయటకు వచ్చి, పిండి పదార్థాన్ని విడదీసినప్పుడు వచ్చే చిన్న స్థాయి ‘ధ్వని విస్ఫోటనం’ అది!

    ఇవి కూడా చదవండి: ఆఫీస్‌ వర్క్‌లో ఫోకస్‌ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్‌ తప్పనిసరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement