గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్‌ సాహసం! | Young Alexander Tames Bucephalus With Brilliant Insight | Sakshi
Sakshi News home page

గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్‌ సాహసం!

Aug 29 2026 9:51 AM | Updated on Aug 29 2026 10:50 AM

Young Alexander Tames Bucephalus With Brilliant Insight

మహనీయుల బాల్యం

లెగ్జాండర్‌కు 12 ఏళ్ల వయసు ఉండగా అతని తండ్రి ఫిలిప్‌ దర్బారుకు ఒక వ్యాపారి చాలా అందమైన, బలమైన గుర్రాన్ని అమ్మడానికి తెచ్చాడు. దాని పేరు ‘బుసిఫాలస్‌’. కాని ఆ గుర్రం ఎంత కోపంగా ఉందంటే దాన్ని లొంగదీసుకోవడానికి దర్బారులోని పెద్ద పెద్ద వీరులు, సైనికులు వచ్చినా అది ఎవరినీ దరి చేరనివ్వకుండా వెనక కాళ్లతో తంతూ భీభత్సం సృష్టించింది. దాంతో రాజు ఫిలిప్‌ విసిగిపోయి ‘ఇది ఎవరికీ లొంగదు, దీన్ని అవతలికి తీసుకెళ్లండి‘ అన్నాడు.

అప్పుడు అలెగ్జాండర్‌ ముందుకు వచ్చి, ‘నాన్న! నేను దీన్ని లొంగదీస్తాను’ అన్నాడు. అందరూ ఆ చిన్న పిల్లోడిని చూసి నవ్వారు. కానీ అలెగ్జాండర్‌ అందరిలా గుర్రాన్ని కొట్టలేదు. గుర్రం తన స్వంత నీడ కదలడం చూసి భయపడుతోందని గ్రహించాడు. వెంటనే అతను గుర్రం ముఖాన్ని సూర్యుడి వైపు తి΄్పాడు. దాంతో గుర్రానికి తన నీడ కనిపించకుండా పోయింది.

అలెగ్జాండర్‌ మెల్లగా దాని వీపు నిమిరి, ఒక్క ఉదుటున దానిపైకి ఎక్కాడు. అంతే! అంతవరకు భయంకరంగా ప్రవర్తించిన గుర్రం అలెగ్జాండర్‌ చేతిలో చాలా శాంతంగా మారిపోయింది. ఆ బుసిఫాలస్‌ గుర్రమే అలెగ్జాండర్‌ చివరి యుద్ధం వరకు అతని ్రపాణ స్నేహితుడిగా నిలిచింది. సమస్య ఎంత పెద్దదైనా, భయపడకుండా దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తిస్తే విజయం మనదేనని ఈ బాల్య ఘట్టం మనకు నేర్పుతుంది!

ఇవి కూడా చదవండి: ‘రావే చెలీ’... పాట మైకంలో చెవిటిదైపోయే పక్షి.. ఎక్కడుందో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement