ప్రాణి ప్రపంచం
పిల్లలూ... ఈ ఫోటోలో ఉన్న పక్షి పేరు ‘వుడ్ గ్రౌస్’ (Wood Grouse). యూరప్ అడవుల్లో ఉండే ఒక రకమైన అడవి కోడి ఇది. సాధారణంగా పక్షులు భయం వేస్తే పారిపోతాయి కదా, కానీ దీనికి కోపం వస్తే మనుషులపైనే దాడి చేస్తుంది! ముఖ్యంగా ఆడకోళ్లను ఆకర్షించడానికి ఇది చేసే హడావిడి అంతా ఇంతా కాదు.
అడవిలో ఒక ఎత్తైన చెట్టు కొమ్మ మీదో, నేల మీదో కూర్చుని ‘రావే చెలీ’ అంటూ ప్రేమ పాటలు లంఘించుకుంటుంది. అయితే ఇది పాట పాడుతున్నప్పుడు చేసే ఒక రకమైన పెద్ద శబ్దం వల్ల దాని చెవి లోపల ఉన్న ఒక చిన్న కండరం గట్టిగా మూసుకుపోతుంది. అంటే ఆ పాట పాడే చివరి 3 నుండి 4 సెకన్ల పాటు పూర్తిగా తాత్కాలిక చెవిటిదైపోతుంది.
పాట మైకంలో పడి, తనకు తానుగా చెవిటిదైపోయే ఈ చిన్న బలహీనతను కనిపెట్టిన వేటగాళ్లు ఆ కొన్ని సెకన్లలోనే దీనికి దగ్గరగా వెళ్లి వేటాడుతుంటారు. పాపం కదూ! ప్రకృతి ఈ పక్షికి ఎంతటి అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చిందో, అంతే వింతైన అమాయకత్వాన్ని కూడా ఇచ్చింది.
ఇవి చదవండి: చక్కెర ధరలు పెరిగినా.. తీపి తగ్గొద్దు!


