వరి పొలంలో 3డీ ఆర్ట్‌.. రైతుల సూపర్‌ క్రియేటివిటీ! | China Rice Field Art-3d Paddy Field Paintings | Sakshi
Sakshi News home page

వరి పొలంలో 3డీ ఆర్ట్‌.. రైతుల సూపర్‌ క్రియేటివిటీ!

Aug 29 2026 10:02 AM | Updated on Aug 29 2026 10:41 AM

China Rice Field Art-3d Paddy Field Paintings

రంగుల పంట

మీరు పేపర్‌ మీద బొమ్మ వేస్తారు కదా? మరి వరి పొలంలోనే బొమ్మ వేస్తే? ఇది చైనాలో వరిపొలం. అక్కడ రైతులు వరి మొక్కలతోనే పెద్ద పెద్ద బొమ్మలు వేస్తారు. దీన్ని ‘ప్యాడీ ఆర్ట్‌’ లేదా ’టాన్బో ఆర్ట్‌’ అంటారు. అసలు ఈ ఆర్ట్‌ జపాన్‌ లో మొదలైంది, ఇప్పుడు చైనాలో సూపర్‌ ఫేమస్‌.

ఈ ఫోటోలోని అమ్మాయి జుట్టు, చీర, వాయిద్యం అన్నీ వరి మొక్కలే! కింద నుంచి చూస్తే పొలం మామూలుగా ఉంటుంది. టవర్‌ మీద జనం ఎక్కి చూస్తేనే బొమ్మ కనిపిస్తుంది. అందుకే దీన్ని 3డి పెయింటింగ్‌ అంటారు.

రంగు ఎలా వస్తుంది? మనకు తెల్ల బియ్యం ఉన్నట్టే, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, ఊదా బియ్యం కూడా ఉంటాయి. వాటి ఆకులు కూడా అదే రంగులో ఉంటాయి. ఆకుల్లో ‘ఆంథోసైనిన్‌’ అనే సహజ రంగు ఉంటుంది. రైతు ఏ చోట ఏ రంగు కావాలో, ఆ చోట ఆ రంగు విత్తనం నాటుతాడు. మొక్కలు పెరిగేకొద్దీ బొమ్మ పెద్దదవుతుంది!

ఈ ఆర్ట్‌ చైనాలో షెన్యాంగ్‌ నగరంలో చాలా ఫేమస్‌. అక్కడ ‘రైస్‌ డ్రీమ్‌ పార్క్‌’ అనే పెద్ద పార్క్‌ ఉంది. అక్కడి  రైతులు ప్రతి ఏడాది 13 హెక్టార్లలో 17 పెద్ద బొమ్మలు వేస్తారు. మొక్కల ఎత్తును కూడా కంట్రోల్‌ చేసి 3డి ఎఫెక్ట్‌ తెస్తారు. రైతు అంటే అన్నం పండించేవాడే కాదు, ఆర్టిస్ట్‌ కూడా! మనం కూడా మన పొలంలో బతుకమ్మ బొమ్మ వేయొచ్చు కదా!
- నిర్వహణ: కె

ఇవీ చదవండి: గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్‌ సాహసం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement