ఎనిమిదో స్థానంతో సరి | India loses to Belgium in Hockey World Cup qualifier | Sakshi
Sakshi News home page

ఎనిమిదో స్థానంతో సరి

Aug 29 2026 3:31 AM | Updated on Aug 29 2026 11:28 AM

India loses to Belgium in Hockey World Cup qualifier

వర్గీకరణ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో భారత్‌ ఓటమి

అమ్‌స్టెల్వీన్‌: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకుంది. వర్గీకరణ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు షూటౌట్‌లో బెల్జియం చేతిలో ఓడింది. 7–8 స్థానాల కోసం శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో టీమిండియా 3–4 గోల్స్‌ తేడాతో బెల్జియం చేతిలో ఓడింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3–3తో సమంగా నిలవగా... విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ నిర్వహించారు. 

భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (31వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... అభిషేక్‌ (6వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. బెల్జియం తరఫున రోమాన్‌ (22వ ని.లో), హుగో (23వ ని.లో), స్లూవర్‌ (47వ ని.లో) తలా ఒక గోల్‌ చేశారు. షూటౌట్‌లో శైలానంద్‌ లక్రా, దిల్‌ప్రీత్‌ సింగ్, అభిషేక్‌ గోల్స్‌ చేయగా... హర్మన్‌ప్రీత్, సుఖ్‌జీత్‌ విఫలమవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. గత ప్రపంచకప్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన టీమిండియా ఈ సారి ఒక స్థానం మెరుగు పరుచుకుంది. 

మహిళల హాకీ జట్టుకు 50 లక్షల నజరానా.. 
మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఐదో స్థానంలో నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) శుక్రవారం రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement